Health Tips: మీలో ఎవరికైనా తరచుగా వాంతులు, గుండెల్లో మంట వంటి సమస్యలు కనిపించాయా, ఇవన్నీ కడుపు క్యాన్సర్ లక్షణాలే అని మీకు తెలుసా?

మీలో ఎవరికైనా తరచుగా వాంతులు, గుండెల్లో మంట , మలంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు ఎప్పుడైనా కనిపించాయా? ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని గమనించారా? దీంట్లో ఏదో ఒక రకమైన లక్షణం కనిపిస్తే అది దేనికి కారణం కావచ్చు అని మీకు తెలుసా..

Cancer (Photo-Google)

మీలో ఎవరికైనా తరచుగా వాంతులు, గుండెల్లో మంట , మలంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు ఎప్పుడైనా కనిపించాయా?  ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని గమనించారా? దీంట్లో ఏదో ఒక రకమైన లక్షణం కనిపిస్తే అది దేనికి కారణం కావచ్చు అని మీకు తెలుసా.. అసలు ఈ లక్షణాలు ఉంటే వాటి నుంచి తప్పించుకునేది ఎలా? అయితే ఆలస్యం ఎందుకు వీటి గురించి తెలుసుకుందామా..

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో కొంచెం తిన్నా కూడా కడుపు నిండినట్లు అనిపించడం. ఇంకా కొన్నిసార్లు అయితే అసలు తినకున్నా కూడా  గుండెల్లో మంటగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.  ఇలాంటి లక్షణాలు కనిపించే ప్రతి ఒక్కటి కడుపు క్యాన్సర్ లక్షణాలే అని చెప్పవచ్చు.

నేడు ప్రపంచంలో కనిపించే అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ఎప్పుడైతే ఒక్కసారి మనిషికి  ఆ వ్యాధి సోకిందో ముందు ఉన్న రోజులులాగా తను ఉండలేకపోతాడు.  ముఖ్యంగా రోజు రోజుకి దానిలో ఉండే లక్షణాలు బయటకు కనిపించడం ప్రారంభం అవుతాయి.

ఉదాహరణకు చెప్పాలంటే.. శరీరంలోని ఏదైనా భాగంలో కొత్త కణుతులు కనిపించినట్టు, అలాగే నిరంతరం దగ్గు సమస్య తో బాధపడటం.. మెల్లమెల్లిగా బరువు తగ్గుతూ పోవడం.. ఇవన్నీ ఈ వ్యాధి యొక్క ప్రారంభ లక్షణాలు అని నిపుణులు సూచించారు.

చైనాలో మళ్లీ విజృంభిస్తున్న ఎక్స్‌‌బీబీ కరోనా వేరియంట్, కొత్తగా 209 తీవ్ర కొవిడ్‌ కేసులు నమోదు, 24 మంది మృతి

కొన్ని సార్లు అయితే ఎక్కువగా కారంతో ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా కొంతమందికి గుండెల్లో మంట వంటి సమస్య ఎదురవుతుంది. అయితే ఇలాంటి సమస్యలకు కొంతమంది ఇంటి చిట్కాలను పాటిస్తారు.  కానీ అది కొంత కాలం మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఇలాంటి సమస్యలే తల్లెత్తుతాయి. దీనివల్ల వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం మంచిది అని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఎందుకంటే ఆరోగ్య నిపుణుల చెప్పే సలహాల ప్రకారం..క్యాన్సర్ అనే కణితి కడుపులో పెరుగుతుంది కనుక ఇది ప్రేగుల ద్వారా వెళ్లే ఆహారాన్ని వెళ్లకుండా ఆపుతుంది. దీనివల్ల గుండెల్లో వచ్చే మంట సమస్యను అధికంగా వచ్చేటట్లు చేస్తుంది .