Hair Loss: జుట్టు ఊడిపోతోందని భయపడుతున్నారా, అయితే గంజితో ఇలా చేస్తే, జుట్టు ఊడమన్నా ఊడదు..

గంజిని రోజంతా ఉంచితే గంజి పులుస్తుంది. తరువాత ఆ గంజిని వేడి చేసి చల్లార్చాలి. అందులో కొన్ని చుక్కల అవసరమైన నూనెలు కలపాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలు శుభ్రం చేసుకునేందుకు వాడాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోయి, ఆరోగ్యమంతమైన జుట్టు సొంతం అవుతుంది.

Representational image | Credits: Pixabay

మహిళలను వేధించే సమస్య జుట్టు ఊడిపోవడం. కురులను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం రకరకాల నూనెలు, షాంపూలు, హెయిర్ మాస్క్, కండిషనర్స్ వాడినా ఒక్కోసారి ఫలితం ఉండదు. బలమైన అందమైన శిరోజాలు కావాలంటే గంజి నీళ్లను జుట్టుకు పట్టించాలంటున్నారు నిపుణులు. గంజిని రోజంతా ఉంచితే గంజి పులుస్తుంది. తరువాత ఆ గంజిని వేడి చేసి చల్లార్చాలి. అందులో కొన్ని చుక్కల అవసరమైన నూనెలు కలపాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలు శుభ్రం చేసుకునేందుకు వాడాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోయి, ఆరోగ్యమంతమైన జుట్టు సొంతం అవుతుంది.

జుట్టు రాలడం తగ్గుతుంది: పద్దెనిమిది రకాల అమినో ఆమ్లాలతో తయారైన కెరాటిన్ అనే ప్రొటీన్ వెంట్రుకల్లో ఉంటుంది. బియ్యం నీళ్లలో వీటిలోని ఎనిమిది అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు రాలిపోవడాన్ని సహజ పద్ధతుల్లో నివారిస్తాయి. ప్రొటీన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు బి, సి, ఇ విటమిన్లు ఉంటాయి. బి విటమిన్ కురులను దృఢంగా చేస్తుంది. సి విటమిన్ మాడుకు తేమను అందించే సెబం ఉత్పత్తిని పెంచుతుంది. ఇ విటమిన్ వెంట్రుకలు రాలడాన్ని అడ్డుకుంటుంది.

ఏపీలో కొత్తగా 5,983 మందికి కరోనా, తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 741 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 87 కేసులు

బలమైన కురులు: బియ్యం నీళ్లలోని అమినో ఆమ్లాలు కురులు పెరగడంలో, వాటిని బలంగా మార్చడంలో సాయపడతాయి. వెంట్రుకల చివర్లు చిట్లిపోవడం తగ్గుతుంది. క్రమం తప్పకుండా బియ్యం నీళ్లతో కేశాలను శుభ్రం చేసుకుంటే, తలభాగంలో పీహెచ్ ఒకేస్థాయిలో ఉంటుంది. శిరోజాలు సాగేగుణాన్ని పొందడమే కాదు ఆరోగ్యంగా మారతాయి.

మెరుపునిస్తుంది: పులియబెట్టిన బియ్యం నీళ్లలో విటిమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది దెబ్బతిన్న, నిర్జీవమైన జట్టును సున్నితంగా, పట్టులా మెరిసేలా చేస్తుంది. బియ్యం నీళ్లలోని అయనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ కురులకు రంగు, స్టయిల్‌ను ఇస్తుంది.

తూర్పుగోదావరిలో విషాదం, కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి, మరొకరి పరిస్థితి విషమం

చుండ్రు మాయం: జుట్టు రాలడానికి చుండ్రు కూడా ఒక కారణం. శిరోజాలను బలహీనంగా మార్చి, తొందరగా ఊడిపోయేలా చేస్తుంది. బియ్యం నీళ్లలో చుండ్రుకు కారణమయ్యే శిలీంద్రాన్ని తొలగించే శక్తి ఉంటుంది.