Health Tips: జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా,ఈ హోమ్ రెమెడీస్ తో మీ సమస్యకు పరిష్కారం..
ఆహారంలో మార్పు, మారుతున్న వాతావరణం ,కాలుష్య వాతావరణం వల్ల జుట్టు రాలే సమస్య రోజురోజుకు పెరుగుతుంది.
ఈ మధ్యకాలంలో చాలామంది జుట్టు రాల సమస్యతో బాధపడుతున్నారు. ఆహారంలో మార్పు, మారుతున్న వాతావరణం ,కాలుష్య వాతావరణం వల్ల జుట్టు రాలే సమస్య రోజురోజుకు పెరుగుతుంది. పోషకాహార లోపల వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సమస్య మరి ఎక్కువ ఇబ్బందిని కలిగించే విధంగా ఉంటుంది. అమ్మాయిలు పొడవాటి జుట్టు దృఢమైన జుట్టు కావాలని కోరుకుంటారు. అటువంటి వారి కోసం ఇంట్లోనే మనం కొన్ని చిట్కాలు పాటించునట్లయితే జుట్టు రాల సమస్య నుంచి బయటపడవచ్చు ఆ రెమెడీస్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అలోవెరా జెల్- అలోవెరా జెల్ జుట్టు రాలడాన్ని తగ్గించే ఒక ముఖ్యమైన రెమెడీగా చెప్పవచ్చు. ఇది మన జుట్టుకు కావాల్సినంత తేమను అందిస్తుంది. మన జుట్టును హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాకుండా ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మన జుట్టు పీహెచ్ వాల్యూను స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి అలోవెరా జెల్ ను తలపైన అప్లై చేసుకుని 40 నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో కడిగినట్లయితే మీకు జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడతారు.
Health Tips: ప్రతిరోజు పిస్తా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ...
మెంతులు- మెంతులలో ఐరను, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మెంతులను నానబెట్టి పేస్టులాగా చేసుకుని తలకు అప్లై చేసుకొని ఒక గంట సేపు తర్వాత కడిగినట్లయితే జుట్టు మృదువుగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టుకు కావలసిన పోషణను అందిస్తుంది.
గుడ్డు సోన- కోడిగుడ్డులోని తెల్లటి సొనను తలకు అప్లై చేసినట్లయితే మీ జుట్టు రాలిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా జుట్టుకు పోషణను అందిస్తుంది. జుట్టు కుదురులకు బలాన్ని అందిస్తుంది. దీని ద్వారా మీ జుట్టు దృఢంగా ,పొడవుగా మారుతుంది. గుడ్డులోని తెల్ల సున్నను తలకు అప్లై చేసుకొని ఒక అరగంట తర్వాత శుభ్రం చేసుకున్నట్లయితే జుట్టుకు పోషణన అందించే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
ఉల్లి రసం- ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఏ షాంపులో చూసిన కూడా ఉల్లిపాయ రసాన్ని వాడుతున్నారు. ఉల్లి జుట్టు కుదురులకు బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలిన ప్రదేశంలో కొత్త జుట్టును మొలిపించడానికి ఉల్లి రసం సహాయపడుతుంది. మీకు ఎక్కడైతే జుట్టు అధికంగా రాలిందో ఆ ప్రదేశంలో ఉల్లిపాయ రసాన్ని రాసినట్లయితే జుట్టు తిరిగి మొలుస్తుంది. ఉల్లి రసాన్ని తలకు అప్లై చేసుకొని 20 నిమిషాల తర్వాత కడుక్కున్నట్లయితే జుట్టు బలంగా దృఢంగా మారుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి