Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా, అయితే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగితే బరువు తగ్గుతారు..

బరువు తగ్గాలనుకునేవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తొందరగా తగ్గరు. దీనికోసం వారు ఎక్ససైజ్ ఆహారం మానివేయడం వంటివి చేస్తుంటారు.

obesity

ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తొందరగా తగ్గరు. దీనికోసం వారు ఎక్ససైజ్ ఆహారం మానివేయడం వంటివి చేస్తుంటారు. అయినప్పటికీ కూడా బరువు తగ్గడం చాలా అసాధ్యంగా అనిపిస్తుంది. అయితే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో కొన్ని డ్రింక్స్ ని తీసుకున్నట్లయితే అవి తొందరగా బరువు తగ్గించడానికి సహాయపడతాయి. ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీలకర్ర వాటర్- జీలకర్రలో అనేక రకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ,ఐరన్, మెగ్నీషియం, ఫోలేట్ వంటివి పుష్కలంగా ఉంటాయి. జీలకర్రలు ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటారు. అయితే జీలకర్ర నీటిని ఖాళీ కడుపుతో తగినట్లయితే బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటికి పంపించడంలో సహాయపడుతుంది.

Health Tips: రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే మీ శరీరంలో ఏమవుతుంది

సోంపు వాటర్- సోంపులు కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఉన్న అనేక రకాల వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక బరువుతో బాధపడేవారు సోంపు నీటిని ప్రతిరోజు ఖాళీ కడుపుతో తాగినట్లయితే బరువు తొందరగా తగ్గుతారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపుబ్బరం, అజీర్ణం సమస్యలు ఉన్నవారు కూడా ఈ సొంపు వాటం తీసుకుంటే తగినంత ఫలితం లభిస్తుంది.

దాల్చిన చెక్క నీరు- దాల్చిన చెక్కను ఫ్యాట్ కట్టర్ అని అంటారు. ఇది మసాలా దినుసులు లాగానే కాకుండా అనేక రకాల ఔషధ గుణాలు కలిగి ఉంది. దాల్చిన చెక్కను పొడిగా చేసుకొని నీటిలో మరిగించి తాగినట్లయితే తొందరగా బరువు తగ్గుతారు. దీనికి వేడి చేసే స్వభావం ఉంటుంది. కాబట్టి మన శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో ఈ దాల్చిన చెక్క నీరు సహాయపడుతుంది.

ధనియాల వాటర్- ధనియాలలో అనేక రకాల ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది వెయిట్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఐరన్, జింక్, పోలేట్,వంటివి మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ధనియాల వాటర్ తాగడం ద్వారా బరువు తొందరగా తగ్గుతారు. అంతేకాకుండా మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారికి ఇది చక్కటి పరిష్కారం చెప్పవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి