Health Tips: ఎసిడిటీ ,కడుపునొప్పి వంటి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఖాళీ కడుపుతో ఈ పండు తింటే వెంటనే ఉపశమనం..
ఇది జీర్ణ సమస్య సాధారణంగా ఆలస్యంగా తినడము ,ఆలస్యంగా నిద్ర లేవడము అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం ,మసాలాలు, కారాలు ఎక్కువగా తీసుకోవడం, పులుపు పదార్థాలు, ధూమపానం, మద్యపానం వంటి వాటి వల్ల కూడా ఈ ఎసిడిటీ, కడుపులో, ఉబ్బరం అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.
ఈ మధ్యకాలంలో గ్యాస్, ఎసిడిటీ వంటివి ఒక సాధారణమైన సమస్యగా చెప్పవచ్చు. ఇది జీర్ణ సమస్య సాధారణంగా ఆలస్యంగా తినడము ,ఆలస్యంగా నిద్ర లేవడము అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం ,మసాలాలు, కారాలు ఎక్కువగా తీసుకోవడం, పులుపు పదార్థాలు, ధూమపానం, మద్యపానం వంటి వాటి వల్ల కూడా ఈ ఎసిడిటీ, కడుపులో, ఉబ్బరం అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. అయితే కొంతమందిలో ఉదయం లేచిన వెంటనే కడుపులో మంట ఉబ్బరం అనిపిస్తే వెంటనే అరటిపండును తిన్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడతారు..
అరటిపండు- ఖాళీ కడుపుతో ఉదయాన్నే అరటిపండును తీసుకున్నట్లయితే ఇది మీ ఎసిడిటీ ప్రాబ్లెమ్ ను తగ్గిస్తుంది. అరటిపండు జీర్ణ క్రియ కు చాలా మంచిది. ఇది త్వరగా జీర్ణం అవుతుంది. మీ పొట్టలో ఏర్పడే ఆసిడ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అరటి పండులో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల ఎస్టిడిటీ కడుపునొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది.
Health Tips: మహిళల్లో వచ్చే ఈస్ట్ ఇన్ఫెక్షన్ కారణాలు, చిట్కాలు ..
ఎప్పుడు తినాలి- ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు అరటి పండ్లను తింటే ఎస్వికి నుంచి పూర్తి ఉపశమనాన్ని మీరు పొందవచ్చు.
అంతేకాకుండా ఉదయం నిద్ర లేచిన వెంటనే జీలకర్ర నీటిని తాగడం వల్ల కూడా తగ్గుతుంది. ఖాళీ కడుపుతో కాఫీ టీ తాగడం వల్ల సమస్య మరింతగా పెరుగుతుంది. కాబట్టి ఉదయం మీ వాటి తీసుకోకపోవడమే మంచిది మీరు కాఫీ టీ లను అల్పాహారం చేసిన తర్వాత తాగితే మంచిది.
ఐసిడిటీని తగ్గించే మార్గాలు.
ఎసిడిటీని తగ్గించుకోవడానికి రోజు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలి. ఆహారాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవాలి. బాగా నమిలి తినాలి. అంతేకాకుండా శరీరానికి తగినంత శ్రమ ఇవ్వాలి. యోగ ,మెడిటేషన్ వంటివి ఎసిడిటీ సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా మాంసాహారం, ధూమపానం, మద్యపానం, జంక్ ఫుడ్స్ ,ఆయిల్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కు దూరంగా ఉంటే ఈ ఎసిడిటీ సమస్య నుంచి బయటపడవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి