Health Tips: పీరియడ్స్ సమయంలో తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.

ఇది తీవ్ర ఇబ్బంది కలిగించే సమస్యగా చెప్పుకోవచ్చు. అయితే కొన్నిసార్లు మన ఇంట్లోనే ఉండే కొన్ని చిట్కాలతోటి ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.

irregular periods

పీరియడ్స్ సమయంలో మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య కడుపునొప్పి. ఇది తీవ్ర ఇబ్బంది కలిగించే సమస్యగా చెప్పుకోవచ్చు. అయితే కొన్నిసార్లు మన ఇంట్లోనే ఉండే కొన్ని చిట్కాలతోటి ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు కడుపునొప్పి, గ్రామస్తులు తగ్గించుకోవడానికి ఈ ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి.

గుమ్మడి గింజలు- గుమ్మడి గింజల్లో మెగ్నీషియము, ఐరను, జింకు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి మహిళల్లో వచ్చే హార్మోన్ల సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా పీరియడ్స్ ముందు వచ్చే పీ మినిస్ట్రోల్ సిండ్రోం వంటి లక్షణాలను తగ్గిస్తాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.

నువ్వులు- నువ్వుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో రక్తహీనత ఎక్కువగా ఇబ్బంది పడుతోంది. అటువంటి అప్పుడు నువ్వులను తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా ఇది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఐరన్ అధికంగా ఉండడం వల్ల మెగ్నీషియము అధికంగా ఉండడం ద్వారా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తాయి.

తేనె- తేనెను యాంటీ ఆక్సిడెంట్లు ,యాంటీ బ్యాక్టీరియా లక్షణాల పుష్కలంగా ఉంటాయి. ఇది పీరియడ్స్ సమయంలో వచ్చే ఒత్తిడిని హార్మోనల్ ఇన్ బాలన్స్ ను తగ్గిస్తాయి. మన శరీరంలో వచ్చే కార్టిసాల్ హార్మోన్ ను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. దీని ద్వారా ఆందోళన, ఒత్తిడి వంటి సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాకుండా పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపునొప్పిని కూడా తగ్గిస్తుంది.

Health Tips: ఈ చెడు అలవాట్లు మీకు కిడ్నీకి హాని కలిగిస్తాయి.

తాజా కూరలు పండ్లు- పీరియడ్స్ సమయంలో విటమిన్ల అధికంగా ఉన్న కూరగాయలు పండ్లను తీసుకున్నట్లయితే ఇది హార్మోనల్ ఇన్బాలన్సును క్రమబద్ధం చేస్తుంది. దీనివల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది.

తగినంత నిద్ర- పీరియడ్స్ సమయంలో శరీరం ఒత్తిడికి గురవుతుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా మన శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వాలి నిద్ర లేకపోవడం వల్ల కూడా హార్మోనల్ ఇమ్బాలన్సు అవుతుంది. దీనికి కారణంగా పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా అవుతుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో శరీరానికి తగినంత విశ్రాంతి ఇస్తే పీరియడ్ గ్రామస్ నుంచి బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి