Health Tips: ముఖం పైన మచ్చల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పదార్థాలతో మీ మచ్చలు ఈజీగా తొలగిపోతాయి.

ముఖ్యంగా మచ్చల వల్ల అందం పాడవుతుందని తరచుగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

pimples

ఈ మధ్యకాలంలో చాలామంది తమ ముఖం పైన మచ్చల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మచ్చల వల్ల అందం పాడవుతుందని తరచుగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కారణాలు తెలుసుకున్నట్లయితే జీవనశైలిలో మార్పు హానికరమైన ఆహారపు అలవాట్లు, హార్మోన్ల ప్రభావం, కాలుష్యం, సూర్య కాంతి వల్ల ముఖం పైన మచ్చలు ఏర్పడతాయి. అయితే వీటిని తగ్గించుకోవడం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అనేక రకాలైనటువంటి కాస్మెటిక్స్ ను యూస్ చేస్తారు. అయితే అవి కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. అలా కాకుండా కొన్ని ఆహార పదార్థాలతో మనము ఈరోజు ఈ మచ్చల సమస్య నుండి బయటపడవచ్చు. ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయ- నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన చర్మానికి మంచి బ్లీచింగ్ గా పని చేస్తుంది. ఒక గిన్నెలో కొంచెం నిమ్మకాయ రసాన్ని తీసుకొని అందులో అర టీ స్పూను తేనె కలుపుకోవాలి. దీన్ని ముఖం పై అప్లై చేసుకొని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులు చేసినట్లయితే మీ మొహం పై ఉన్న మచ్చలు తొలగిపోతాయి.

బంగాళాదుంప- పచ్చి బంగాళదుంప కూడా మన ముఖం పైన ఉన్న మచ్చలను తొలగిస్తుంది. పచ్చి బంగాళదుంప ముక్కలను తీసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసుకుని ముఖం పైన అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకున్నట్లయితే మీ ముఖం పైన ఉన్న మచ్చలు తొలగిపోతాయి. దీన్ని వారానికి రెండు నుండి మూడు సార్లు చేసుకోవచ్చు.

Health Tips: పాలతో పాటు ఈ 5 కూరగాయలను తింటున్నారా

అలోవెరా జెల్- అలోవెరాలో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ఇది ఆరోగ్యానికి కాకుండా అందానికి కూడా చక్కగా పనిచేస్తుంది. కలబంద గుజ్జును తీసుకొని అందులో రెండు చుక్కల నిమ్మ రసాన్ని వేయాలి. దీన్ని మొహానికి అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మసాజ్ చేసుకొని ముఖం శుభ్రపరచుకోవాలి దీన్ని కొన్ని రోజులపాటు రెగ్యులర్ గా ఉపయోగిస్తే మీ మొహం పైన ఉన్న మచ్చలు తొలగిపోతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif