Health Tips: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..కారణాలు, లక్షణాలు నివారణ గురించి తెలుసుకుందాం.
ఇది వారి జీవన శైలి పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మనం మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంధి.
ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య థైరాయిడ్ సమస్య. ఇది వారి జీవన శైలి పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మనం మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంధి. ఇది మన హార్మోన్లను నియంత్రించే ఒక గ్రంధి ఇది హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంధి సరిగ్గా పనిచేయనప్పుడు థైరాయిడ్ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. గర్భం సమయంలో డెలివరీ సమయంలో దాదాపుగా చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. దీని కారణాలేంటి లక్షణాలు చికిత్స విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కారణాలు
అయోడిన్ లోపం: మన శరీరానికి అయోడిన్ చాలా అవసరం ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్లు ఏర్పడడానికి ఈ అయోడిన్ అనేది చాలా అవసరం. ఉంటే థైరాయిడ్ గ్రంధి సరిగా హార్మోన్లను ఉత్పత్తి చేయలేక పోతుంది. అప్పుడు థైరాయిడ్ సమస్యకు దారితీస్తుంది.
పుట్టుకతో వస్తుంది: కొంతమందిలో పుట్టుకతోటే ఈ థైరాయిడ్ వ్యాధి అనేది వస్తుంది. ఇది వారి గ్రంధిని సాధారణంగా పనిచేయకుండా ఉన్నప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్లు ఇన్బాలన్స్ అవుతూ ఉంటాయి. ఒకవేళ తల్లికి థైరాయిడ్ ఉంటే అది బిడ్డకు కూడా సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రకాలు,లక్షణాలు.
హైపోథైరాయిడిజం- థైరాయిడ్ గ్రంథి తగినంతగా ఈ హార్మోన్ ని ఉత్పత్తి చేయనప్పుడు హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది. దీని లక్షణాలు శరీరంలో నీరసంగా అనిపించడం, అలసట అనిపించడం, బరువు పెరగడం, ఎప్పుడూ జ్వరంగా అనిపించడం, చర్మం పొడి వారడం, జుట్టు రాలిపోవడం, కండరాల నొప్పి, కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు రావడం, జీర్ణ సమస్యలు, నిరాశ, ఆందోళన , రక్తపోటు తగ్గడం వంటివి ఈ హైపోథైరాయిడిజం లక్షణాలు
హైపర్ థైరాయిడిజం- థైరాయిడ్ గ్రంధి అధిక మొత్తంలో హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు హైపర్ థైరాయిజం అనేది వస్తుంది. దీని లక్షణాలు చూసుకున్నట్లయితే బరువు తగ్గిపోవడం, గుండె కొట్టుకోవడంలో అవకతవకలు, మానసికంగా ఇబ్బంది పడడం, భయము, ఆందోళన, కాళ్లు చేతుల్లో, వణుకు చెమట పట్టడం, నిద్ర లేకపోవడం, రాత్రులు మేలుకొని ఉండడం, చర్మం వేడిగా ఉండడం, అధికంగా చెమట పోయడం వంటివి హైపర్ థైరాయిడిజం లక్షణాలు.
Health Tips: అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా.
చికిత్స- థైరాయిడ్ వ్యాధులైన హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం రెండు కూడా రెండిటి కూడా చికిత్స అవసరం. ఈ గ్రంధి హార్మోన్ ను ఉత్పత్తి నార్మల్గా చేయడానికి కచ్చితంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ సూచించిన మేరకు మందులు తీసుకున్నట్లయితే ఇది మీ శరీరంలో సహజ థైరాయిడ్ హార్మోన్లుగా పని చేస్తాయి.
తీవ్ర సమస్యలు- ఒకవేళ మీరు హైపోథైరాయిడ్ సమయానికి గుర్తించకపోతే కొన్నిసార్లు మీ మెదడులో సమస్యలు ఏర్పడతాయి. అదే విధంగా హైపోథైరా హైపర్ థైరాయిడిజం కారణంగా గుండె దడ పెరుగుతుంది. గుండె జబ్బులకు కారణం అవుతుంది. కొన్నిసార్లు హైపోతైరాయిడిజం వల్ల సోడియం లెవెల్స్ తగ్గి రోగి కోమలోకి వెళ్ళవచ్చు. పుట్టిన పిల్లల్లో ఈ సమస్యను గుర్తించకపోతే వారి ఎదుగుదలకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి వారు మానసికంగా కూడా ఎదుగుదల ఆగిపోతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. వెంటనే డాక్టర్ కి సంప్రదించి సకాలంలో గుర్తించి మందులు వాడితే ఈ వ్యాధి నుండి బయటపడవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.