Health Tips: ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా..అయితే ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..బీపీ, షుగర్ మీ జోలికి రావు..

అలాగే హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, వేరే ఇతర కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి.

diabetes Reprasentative Image (Image: File Pic)

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరినీ అనేక రకాల ఆరోగ్య సమస్యలు బాధపెడుతున్నాయి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యం కావడం లేదు. నీరసం,అలసట సమస్యలతో బాధ పడేవాళ్లకు ప్రయోజనం అందే విధంగా కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా..

ఎవరైతే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ సమస్యతో బాధపడుతూ ఉంటారో వాళ్లు మాత్రం తప్పనిసరిగా అలసటతో బాధపడే అవకాశం ఉంటుంది. అలాగే హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, వేరే ఇతర కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి.

తలనొప్పి, కీళ్లనొప్పులు, గొంతు నొప్పి , ఏకాగ్రత తగ్గిపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, కండరాలు, అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి లాంటి సమస్యలతో బాధపడుతుంటే దానిని సిండ్రోమ్ సమస్యగా గుర్తించాల్సి ఉంటుంది.

ఒత్తిడి తగ్గించుకోవడం, ప్రశాంతమైన నిద్ర, అధిక శ్రమను నివారించడం, సమతుల్య జీవనశైలితో ఈ సమస్యలను చెక్ పెట్టవచ్చు. అధిక శ్రమ వల్ల ఈ సమస్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. శారీరక శ్రమ తగ్గించుకోవడం, పనులను విభజించుకోవడం ద్వారా ఈ సమస్యలను చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. అవసరమైనప్పుడల్లా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం ద్వారా ఈ సమస్యను దూరం పెట్టే అవకాశం ఉంటుంది. ధ్యానం లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,

మైండ్‌ఫుల్‌ నెస్, యోగా, నచ్చిన పనులు చేయడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. పండ్లు, కూరగాయలు, తృణదాన్యాలు, లీన్ ప్రోటీన్లు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి మనిషి సరిపడినంతా నీళ్లు తాగడం, సులభమైన వ్యాయామాలు చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు.