Health Tips: మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నారా దానికి బదులుగా ఈ ఆహార పదార్థాలను తినండి..
మన శరీరానికి విటమిన్లు చాలా ముఖ్యం అయితే కొంతమంది వాటిని ఆహార పదార్థాల ద్వారా కాకుండా మాత్ర రూపంలో తీసుకుంటారు.
చాలామంది శరీరానికి బలం కోసం మల్టీ విటమిన్ టాబ్లెట్ ల మీద ఆధారపడి ఉంటారు. మన శరీరానికి విటమిన్లు చాలా ముఖ్యం అయితే కొంతమంది వాటిని ఆహార పదార్థాల ద్వారా కాకుండా మాత్ర రూపంలో తీసుకుంటారు. ఇది అంతా మంచిది కాదు. దీనివల్ల ఒక్కొక్కసారి అని కరకర అనారోగ్య సమస్యలు వస్తాయి.
మన ఆహారంలో ఈ పదార్థాలు చేర్చుకోవడం ద్వారా మనకు అనేక రకాల విటమిన్ లో మన శరీరానికి అందుతాయి. మల్టీ విటమిన్ టాబ్లెట్ తో అవసరాలు ఉండవు. పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ సి కోసం- విటమిన్ సి మన శరీరానికి అందడం కోసం ఈ సీజన్లో దొరికే అన్ని రకాల పండ్లను తినడం ద్వారా మన శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ముఖ్యంగా నారింజ, ఉసిరి, బత్తాయి వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరంలో విటమిన్ సి లోపం ఉండదు. దీని వల్ల మనకు రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. దీని కారణంగా అనేక రకాల సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడవచ్చు.
Health Tips: గర్భాశయం బలహీనంగా ఉండడానికి కారణాలు ,నివారణ
ఐరన్ లోపం- ఐరన్ లోపం ఉన్నవారు ఖర్జూరాన్ని తీసుకోవడం ద్వారా ఈ లోపం నుండి బయటపడవచ్చు. ఐరన్, హిమోగ్లోబిన్ వంటివి మన శరీరానికి చాలా ముఖ్యము అంతేకాకుండా రక్తహీనతతో అనేక రకాల సమస్యలు వస్తాయి. అటువంటివారు ఖర్జూరాన్ని రాత్రి పాలల్లో నానబెట్టి ఉదయాన్నే రెండు కలిపి తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావాల్సినంత ఐరన్ అందుతుంది.
ప్రోటీన్లు- శరీరానికి ప్రోటీన్ పుష్కలంగా ఉండాలి అంటే తృణధాన్యాలు, డ్రైఫ్రూ తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. జామకాయలో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. రుణ ధాన్యాలను అధికంగా తీసుకోవడం ద్వారా మీకు శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ లభిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి