Health Tips: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా... అయితే వీటికి దూరంగా ఉండండి.

ముఖం పైన ముడతలు కనిపిస్తున్నాయి. అటువంటి వారు తమ జీవనశైలని మార్చడం చాలా అవసరం.

(Image: Facebook)

ఈరోజుల్లో చాలామందిలో చిన్న వయసులోనే చర్మం నిగారింపును కోల్పోతుంది. ముఖం పైన ముడతలు కనిపిస్తున్నాయి. అటువంటి వారు తమ జీవనశైలని మార్చడం చాలా అవసరం. ముఖ్యంగా శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడము, అధిక బరువు, ఒత్తిడి, నిద్ర లేకపోవడం వీటి ద్వారా చర్మం కాంతి విహీనంగా తయారవుతుంది. చర్మం నిస్తేజంగా ఉండడానికి కారణమయ్యే కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం.

జంక్ ఫుడ్:  బయట ఫుడ్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కాకుండా మన చర్మానికి కూడా చాలా ఇబ్బందిని గురిచేస్తుంది. వృద్యాప్య లక్షణాలు వచ్చేలా కూడా చేస్తుంది. మీ శరీరాన్ని బలహీన పరుస్తుంది. కాబట్టి జంక్ ఫుడ్ కు దూరంగా ఉండి పోషకాలు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. దీని ద్వారా మీ చర్మం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.

ఒత్తిడి: ఒత్తిడి వల్ల కూడా మన శరీరం పైన చెడు ప్రభావం చూపుతుంది. దీని ద్వారా మనకు జుట్టు రాలడం మన శరీరంలో కొల్లాసిన ఉత్పత్తి తగ్గిపోవడం ద్వారా మన చర్మం నిస్తేజంగా అనిపిస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు అనేక రకాలైన హార్మోన్లు విడుదలవుతాయి. ఇది మన చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేసి మన చర్మం పైన మచ్చలు మొటిమలు ముడతలు ఏర్పడడానికి కారణం అవుతుంది. కాబట్టి ఎప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి.

Health Tips: పుచ్చకాయ గింజలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ...

స్మోకింగ్ ,డ్రింకింగ్: ధూమపానం మద్యపానం వల్ల మన శరీరానికి ఆక్సిజన్ సరిగా సరఫరా అవ్వదు. దీని ద్వారా మన శరీరంలో కొత్త కణాలు ఏర్పడవు. కాబట్టి మన చర్మం నిస్తేజంగా అనిపిస్తుంది. అధికంగా ఆల్కహాలు స్మోకింగ్ చేయడం ద్వారా మన మొహం మీద వాపు ఏర్పడి వృద్ధాప్య ఛాయలు చిన్న వయసులోనే ఏర్పడతాయి.

శ్రమ లేకపోవడం: ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ తగ్గిపోయింది. వ్యాయామం చేయట్లేదు చాలామంది దీని కారణంగా మన శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగదు. కాబట్టి మన మొహం అనేది నీరసంగా ఉంటుంది. నిస్సిజంగా అనిపిస్తుంది కాబట్టి ప్రతిరోజు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా శరీరం చర్మం కాంతివంతంగా మారుతాయి.

నిద్రలేమి:  మన శరీరానికి నిద్ర చాలా అవసరం. కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. ఇది మనల్ని ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తాయి. నిద్ర తక్కువైతే ఎప్పుడు అలసటగా చిరాకుగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు 8 గంటల నిద్రపోవడం అనేది అలవాటు చేసుకోండి. దీని ద్వారా ఈ శరీరమే కాకుండా మీ చర్మం కూడా ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.