IPL Auction 2025 Live

Health Tips: అరటిపండు ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది..

చర్మం నికారింపును సంతరించుకోవడానికి అరటిపండు చాలా బాగా ఉపయోగపడుతుంది.

banana

అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. చర్మం నికారింపును సంతరించుకోవడానికి అరటిపండు చాలా బాగా ఉపయోగపడుతుంది. విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో పొటాషియం, కాల్షియం, జింక్ వంటి కణాలు చర్మ కణాలను శుభ్రపరుస్తాయి. అంతేకాకుండా ఇది మన చర్మాన్ని మెరిసే లాగా చేస్తుంది. ఇది చర్మానికి ఏ విధంగా మేలు చేస్తుందో తెలుసుకుందాం..

పండిన అరటిపండు చర్మానికి ఒక వరంగా చెప్పవచ్చు. దీన్ని కొన్ని పదార్థాలతో కలిపి మన మొహానికి అప్లై చేసుకుంటే అద్భుతమైన నిఘారింపు లభిస్తుంది. అంతేకాకుండా అనేక రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. అరటి పండుతో ఈ ఫేస్ ప్యాక్ చేసుకున్నట్లయితే మీ మొహం నిఘా ఇప్పుడు సంతరించుకుంటుంది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పసుపు, అరటిపండు ఫేస్ ప్యా- బాగా పండిన ఒక అరటి పండును తీసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని దాని బాగా కలిపి మొహానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు మొహం పైన అలాగే ఉంచి చల్లటి శుభ్రమైన నీటితో కడుక్కున్నట్లయితే మీకు చర్మ సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. మొహం పైన ఉన్న మచ్చలు మొటిమలు అన్నీ కూడా తగ్గిపోతాయి. పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఇవి హానికర బ్యాక్టీరియాలను తొలగిస్తాయి.

చీజ్ అతిగా తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ...

పెరుగు ,అరటిపండు ఫేస్ ప్యాక్- ఒక టీ స్పూన్ పెరుగు తీసుకొని ఆర ముక్క అరటిపండులో కాస్త కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను మొహం పైన ,మెడ పైన 20 నిమిషాల పాటు ఉంచాలి, తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి, ఇవి రెండు కూడా చేసినట్లయితే చర్మం పైన ఉన్న మృత కణాలు తొలగిపోతాయి, పెరుగు చర్మానికి తేమను అందిస్తుంది. ముడతలు మచ్చలు రాకుండా మృదువుగా ఉంచేలాగా చేస్తుంది.

కీర ,అరటిపండు ఫేస్ ప్యాక్- కీరలో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మన మొహానికి చలవదనాన్ని అందిస్తుంది. మొహం పైన పేర్కొన్న జిడ్డును మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. అరటిపండులో కీరా మొక్కల పేస్టును కలిపి మెత్తగా కల్పిన తర్వాత ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఇది 15 నుంచి 20 నిమిషాల పాటు మొహం పైన ఉండేలా చూసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసినట్లయితే మీ మొహం పైన ఉన్న మచ్చలు, మొటిమలు అన్నీ కూడా తొలగిపోయి మీ చర్మానికి కావాల్సినంత తేమను అందిస్తుంది. దీని ద్వారా మీ మొహం నిహరింపును సంతరించుకుంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి