Health Tips: కర్పూరం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.
చాలామంది కర్పూరాన్ని పూజకు వినియోగిస్తూ ఉంటారు. ఇది కేవలం పూజకు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
కర్పూరానికి మన భారతీయ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది కర్పూరాన్ని పూజకు వినియోగిస్తూ ఉంటారు. ఇది కేవలం పూజకు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కర్పూరంలో యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..
జలుబు, దగ్గు.. కర్పూరం వాసన పీల్చినట్లయితే జలుబు దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. వీటిని వేడి నీటిలో కలిపి ఆవిరి పట్టడం ద్వారా అనేక రకాలైనటువంటి శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి. ముక్కు బ్లాక్ నుంచి కూడా బయటపడవచ్చు. కర్పూరాన్ని నూనెలో కలిపి వేడి చేసుకొని ఆ నూనెను చాతి పైన రాసుకుంటే జలుబు వల్ల వచ్చే శ్వాస సమస్యలు తగ్గిపోతాయి.
Health Tips: ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా ...
నొప్పులు.. చాలామందికి కండరాల నొప్పులు కీళ్ల నొప్పులు వంటివి ఉంటాయి. కర్పూరం నూనెను కండరాలకు కీళ్ల నొప్పులు ఉన్నచోట రాసినట్లయితే ఉపశమనం పొందుతారు. దీన్ని కొబ్బరి నూనెలో కలిపి వేడి చేసుకొని నొప్పి ఉన్న చోట రాస్తే ఆర్థరైటిస్ వెన్నునొప్పి వంటి సమస్యలు ఉన్నవారికి చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.
చర్మ సమస్యలు- కొంతమందిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా దురద, మంట, దద్దుర్లు వంటివి ఏర్పడతాయి. ఈ కర్పూరాన్ని కొబ్బరి నూనెతో కలిపి దురద, మంట ఉన్న ప్రదేశంలో రాసుకున్నట్లయితే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
మానసిక ప్రశాంతత - కర్పూరం వాసన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మానసిక ప్రతి శాంతతను ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది. ఇంట్లో కర్పూరం వెలిగించి వాసన చూసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి