Health Tips: దాల్చిన చెక్కను తీసుకోవడం ద్వారా PCOS ,PCOD వంటి సమస్యలు తగ్గుతాయి..

ఇటీవల కాలంలో కొన్ని అధ్యయనాల ప్రకారం PCOS ,PCOD వంటి హార్మోన్ల సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది

irregular periods

దాల్చిన చెక్క ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు కూడా అద్భుత వరమని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కొన్ని అధ్యయనాల ప్రకారం PCOS ,PCOD వంటి హార్మోన్ల సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. అయితే ఇది ఎలా సహాయపడుతుందో దీని ద్వారా PCOS ,PCODఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

PCOS ,PCODవంటి సమస్యలు పునరుత్పత్తి వయసు గల స్త్రీలలో హార్మోనల్ ఇన్ బాలన్స్ కారణంగా ఈ సమస్యలు ఏర్పడతాయి. అండాశయాల్లో చిన్న చిన్న గడ్డలు ఏర్పడడం వల్ల రుతుక్రమం సక్రమంగా జరగదు. ఇది మహిళల గర్భధారణం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా బరువు పెరగడం, జుట్టు రాలడం, మొటిమలు,  వంటి సమస్యలు ఏర్పడతాయి. సమస్యలు ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తాయి. దీని ద్వారా షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యతో గుండె జబ్బులు అధిక రక్తపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది.

దాల్చిన చెక్క ఎలా ఉపయోగపడుతుంది- దాల్చిన చెక్కను తీసుకోవడం ద్వారా PCOS ,PCOD వంటి లక్షణాలు ఉన్నవి మహిళలకు వాటిని తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా పి సి ఓ ఎస్ సమస్యలతో బాధపడే మహిళల్లో ఎక్కువగా బరువు పెరగడం ఒక సాధారణ సమస్యగా చెప్పవచ్చు. క్రమం తప్పకుండా ఒక రెండు నెలల పాటు దాల్చిన చెక్కను తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. అంతేకాకుండా దాల్చిన చెక్క జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. శరీరంలో అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

హార్మోన్ హార్మోన్లను ప్రభావితం చేస్తుంది- PCOS ,PCODలో హార్మోనల్ స్థాయి పెరుగుతూ ఉంటాయి. దాల్చిన చెక్క తీసుకోవడం ద్వారా ఈ హార్మోన్ల సమతుల్యత కాపాడబడుతుంది. ఋతుక్రమాన్ని సక్రమంగా ఉంచేలాగా చేస్తుంది.

Health Tips: పచ్చి బఠానీలు అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు

గుండె ఆరోగ్యానికి మంచిది- PCOS ,PCODతో బాధపడుతున్న వారికి LDL కొలెస్ట్రాల సాయిలు ఎక్కువగా ఉంటాయి.  వీటిని తగ్గించడంలో దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది దీని తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.

వాపును తగ్గిస్తుంది- దాల్చిన చెక్కలు తీసుకోవడం ద్వారా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో ఉన్న వాపులను నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది.

ఎలా తీసుకోవాలి- దాల్చిన చెక్కను టీతో కలిపి తీసుకోవచ్చు లేదా పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. లేదా పెరుగులో ఒక స్పూన్ వేసుకొని తీసుకోవచ్చు. లేదా ఆహారంలో మసాలా రూపంలో తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్ గా దాల్చిన చెక్కతో టీ ప్రిపేర్ చేసుకోండి తాగవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి