Health Tips: డయాబెటిక్ పేషెంట్లు వారి షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ ఆహార పదార్థాలను తినండి.
దీని ద్వారా వారికి శక్తి లభిస్తుంది.
డయాబెటిక్ పేషెంట్లు వారి షుగర్ లెవెల్ను కంట్రోల్లో ఉంచుకోవడానికి వారు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన పోషక పదార్థాలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీని ద్వారా వారికి శక్తి లభిస్తుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ తీసుకునే ఆహారము చాలా ముఖ్యమైనది. ఇది వారి బ్లడ్ షుగర్స్ ను పెరగకుండా చేస్తుంది. అంతేకాకుండా వారికి రోజువారి కావాల్సిన శక్తిని అందిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు ఎటువంటి ఆహార పదార్థాలు భాగం చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఓట్స్- షుగర్ వ్యాధిగ్రస్తులకు ఓటు మీల్ అనేది చాలా అద్భుతంగా చెప్పవచ్చు. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగు పడుతుంది. అంతేకాకుండా రక్తంలోనే చక్కర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. ఓట్స్లో బీటా గ్లూటన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. రక్తంలోని చక్కెర లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. షుగర్ ను వేగవంతంగా పెరగకుండా నిరోధిస్తుంది. దీని ద్వారా రక్తంలోని షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా మీకు శక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో అనేక పోషకాలు ఉండడం ద్వారా మీ ఆరోగ్యానికి చాలా మంచిది.
కోడిగుడ్లు- షుగర్ పేషెంట్స్ కోడిగుడ్లను తీసుకోవడం వల్ల వాటిలో ఉన్న ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్ కలిగి ఉండడం. ద్వారా ఇది షుగర్ లెవెల్స్ లో కంట్రోల్లో ఉంచుతుంది. ప్రోటీన్లు తీసుకోవడం ద్వారా కడుపు ఎక్కువ సేపు నిండుగా అనిపిస్తుంది. దీని ద్వారా అనవసరమైన ఆకలి తగ్గిస్తుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. కోడిగుడ్లు తీసుకోవడం ద్వారా మంచి శక్తి కూడా లభిస్తుంది. తీసుకోవడం ద్వారా వారికి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది.
Health Tips: హైపోథైరాయిడిజం అంటే ఏమిటి దీని లక్షణాలు, నివారణ చర్యలు ...
పెరుగు- పెరుగులో ప్రోటీన్లు ,ప్రోబయాటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు గొప్ప ఆహారంగా చెప్పవచ్చు. ఇది రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తుంది. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉండడం ద్వారా షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. పెరుగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. పెరుగులో మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్, బెర్రీస్, తాజా పండ్లతో కలుపుకొని తీసుకోవడం ద్వారా మరింత పోషకాలు లభిస్తాయి జీర్ణ క్రియ కూడా చాలా మంచిది.
అవకాడో- అవకాడ పండులో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు ,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. అవకాడని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అవకాడను ప్రతి రోజు తీసుకోవడం ద్వారా మీకు మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాకుండా వీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి మీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి