Health Tips: పెరుగుతో ఈ 5 రకాల ఫుడ్స్ కలిపి తింటున్నారా... అయితే మీరు విషం తింటున్నట్లే!

అయితే మీరు విషం తింటున్నట్లే!

curd (credits: x)

పెరుగుతో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి: వేసవిలో పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తారు. ఇది అనేక పొట్ట సమస్యల నుండి ఉపశమనం పొంది పొట్టకు చల్లదనాన్ని అందిస్తుంది.కానీ కొన్నిసార్లు పెరుగుకి కొన్నిపదార్దాలు కలపడం వల్ల విషంగా అవుతుంది.

కొన్ని ఆహార పదార్థాలు పెరుగుతో కలిపి తీసుకుంటే అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పొరపాటున కూడా పెరుగుతో తినకూడని కూరగాయలు ,పండ్లు చాలా ఉన్నాయి. మనం ఏ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

సిట్రస్ పళ్లు: నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి వాటిని పెరుగుతో కలిపి తినకూడదు. సిట్రస్ పండ్లలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉన్నందున,అజీర్ణం, గ్యాస్, ఉబ్బరంతో బాధపడవచ్చు.

టొమాటో: టొమాటో ఒక ఎసిడిక్ ఆహారం ,పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్‌తో ఘర్షణ పడవచ్చు. దీని వల్ల ఛాతీలో మంట వస్తుంది. కడుపు ఉబ్బరంతో బాధపడతారు.

మాంసాహరం: రెడ్ మీట్ ప్రొటీన్ పవర్ హౌస్ అయితే పెరుగుతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. ఎందుకంటే మాంసంలో అధిక ప్రొటీన్లు ఉంటాయి, ఇవి ప్రోబయోటిక్స్‌తో పాటు జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తాయి.

దోసకాయ: దోసకాయను పెరుగుతో కలిపి తింటే శరీరంలో చలి ఎక్కువై జలుబుగా , చలి జ్వరంగా అనిపించే ప్రమాదం ఉంది.

పుచ్చకాయలు: పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ,పెరుగుతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.పెరుగుపుచ్చకాయ నీటిలోని లాక్టిక్ యాసిడ్ కలిసి కడుపు నొప్పిని కలిగిస్తుంది.



సంబంధిత వార్తలు