Health Tips: మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా..అయితే వాటిని ఎలా తరిమేయాలో తెలుసా.
ఇది అనేక రకాలైన అనారోగ్య సమస్యలను తీసుకువస్తుంది.
చాలామంది తమ ఇళ్లల్లో బొద్దింకల సమస్యతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇది అనేక రకాలైన అనారోగ్య సమస్యలను తీసుకువస్తుంది. అయితే బొద్దింకలను రావడానికి కారణాలు వాటి తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.
బొద్దింకలు రావడానికి కారణం-మన ఇంట్లో బొద్దింకల రావడానికి కారణం మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకుండా ఉండడం వల్ల అవి వాటికి ఆకర్షితులై వచ్చి తింటాయి. అంతేకాకుండా బొద్దింకలు ఎక్కువగా తడి ఉండే దగ్గర ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా వంటగది, బాత్రూంలో తడి ఉన్న ప్రదేశంలో రావడానికి ఎక్కువ ఇష్టపడతాయి. మన ఇంట్లో మిగిలిపోయిన ఆహారము వ్యర్ధాల కారణంగా బొద్దింకలు ఏర్పడి వాటి సంఖ్యను పెంచుకుంటాయి. అంతేకాకుండా బొద్దింకలు ఎక్కువగా చీకటి ప్రదేశాల్లో ఉంటాయి. ముఖ్యంగా పేపర్లలో, కార్డు బోర్డు బీరువాలలో, అల్మారాలలో, చిన్న చిన్న రంధ్రాలు ఉన్న ప్రదేశాల్లో దాక్కొని ఉంటాయి. ఇది ఎక్కువగా తేమగా ఉన్నప్పుడు చీకటిగా ఉన్నప్పుడు వీటి సంఖ్య పెరుగుతుంది.
రాత్రిపూట భోజనం చేసిన తర్వాత వంట పాత్రలను కడగకుండా చెత్తను నిల్వ చేయడం ద్వారా కూడా బొద్దింకలు వస్తాయి. మిగిలిపోయిన ఆహారం కోసం రాత్రిపూట మనము తిన్న ప్లేట్లలో, చెత్త కుండీలలో మిగిలిపోయిన ఆహారాన్ని తినడానికి వస్తాయి.
Health Tips: ఉదయాన్నే నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల కలిగే లాభాలు .
బొద్దింకలను ఎలా పోగొట్టాలి
బొద్దింకలను రాకుండా ఉంచుకోవడానికి మన ఇంటిని కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మన క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను తీసివేయాలి. ఆహార పదార్థాలు గాలి చొరబడినటువంటి డబ్బాలలో ఉంచాలి. పాత్రలను ఎప్పటికప్పుడు కూడా భోజనం చేసిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
బొద్దింకలు ఎక్కువగా తేమ ఉన్న ప్రదేశంలో ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా వాటర్ లీకేజ్ ఉన్న దగ్గర వీటిని మూయడం ద్వారా బొద్దింకల సంఖ్యను తగ్గించవచ్చు. ఇల్లు ఎంత పొడిగా ఉంటే అంత బొద్దింకల సంఖ్యను తగ్గించుకోవచ్చు. బాత్రూంలో వంటగదిలలో తేమ తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. మీరు వంట చేసిన ప్రతిసారి కూడా కిచెన్ టాప్ ను శుభ్రం చేసుకున్నట్లయితే బొద్దింకలో తగ్గించుకోవచ్చు. డస్ట్ బిన్నీ మూత సరిగ్గా పెట్టినట్లయితే కూడా బొద్దింకల సంఖ్య తగ్గించుకోవచ్చు రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో కూడా సింక్లో ప్లేట్లను ఉంచవద్దు. మార్కెట్లో లభించే బొద్దింకలను చంపే రసాయనాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి మీరు ఇంటి మూలల్లో పెట్టుకున్నట్లైతే బొద్దింకల సంఖ్యను తగ్గించవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.