Health Tips: ప్రతిరోజు కొత్తిమీరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా.
ఇది వంటకు సువాసనను రుచిని కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
కొత్తిమీరను ప్రతిరోజు మనము వంటలో వాడుతూ ఉంటాము. ఇది వంటకు సువాసనను రుచిని కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీరను ప్రతి రోజు తీసుకోవడం ద్వారా మన జీర్ణ క్రియ కు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కొత్తిమీరను ప్రతి రోజు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణశక్తికి- ప్రతిరోజు కొత్తిమీరను వాడడం ద్వారా జీవ సమస్యలు తొలగిపోతాయి. ఇందులో ఫైబర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీని ద్వారా జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్ ,మలబద్ధకం వంటి సమస్యల మీద ప్రభావం అంతగా పని చేస్తుంది. కొత్తిమీరను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
షుగర్ ను కంట్రోల్ చేస్తుంది- కొత్తిమీర షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసే శక్తి ఉంది. ఇందులో ఉండే పోషకాలు షుగర్ లెవల్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు కొత్తిమీర రాసాను లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవడం ద్వారా మీ రక్తంలో ఇన్సులిన్ సాయం నియంత్రిస్తుంది.
గుండెకు మంచిది- కొత్తిమీరను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండెకు బలాన్ని ఇస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు, చెడు కొలెస్ట్రాలను, తగ్గించడంలో సహాయపడతాయి. దీని ద్వారా బీపీ సమస్య కూడా తగ్గుతుంది కొత్తిమీరను తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు తగ్గడమే కాకుండా మీ గుండెను పదిలంగా ఉంచుతుంది.
Health Tips: కడుపులో అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..
థైరాయిడ్ ను తగ్గిస్తుంది- థైరాయిడ్ సమస్యలను తగ్గించడంలో కొత్తిమీర ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో ఉదయాన్నే కోతిమీర రసాన్ని తాగడం ద్వారా థైరాయిడ్ తగ్గుతుంది. థైరాయిడ్ వల్ల బరువు పెరిగిన వారికి ఇది బరువును తగ్గిస్తుంది.
ఇమ్యూనిటీని పెంచుతుంది- కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా సీజనల్ గా వచ్చే జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్ల నుండి బయట పడేస్తుంది.
ఎవరు తీసుకోకూడదు- కొత్తిమీరను అధికంగా వాడడం వల్ల ఒక్కొక్కసారి హాని కలుగుతుంది. ముఖ్యంగా గర్భిణీలలో తర్వాత ఏదైనా సర్జరీ చేసుకున్న వారు దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు. రక్తం పల్చబడే మందులు వాడే వారు కూడా కొత్తిమీరను తక్కువగా తీసుకోవాలి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి