Health Tips: ప్రతిరోజు ఉదయాన్నే నాలుగు తులసి ఆకులను నమలడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

ఈ మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. అటువంటి తులసి మొక్కలు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. తులసిని ఆయుర్వేదంలో సంజీవని మూలికగా కూడా పిలుస్తారు.

Peppermint Tea (Photo Credits: Pixabay)

హిందూమతంలో తులసి మొక్కకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. అటువంటి తులసి మొక్కలు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. తులసిని ఆయుర్వేదంలో సంజీవని మూలికగా కూడా పిలుస్తారు. అనేక రకాల వ్యాధులు చికిత్సలో తులసిని వాడుతూ ఉంటారు. తులసిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. తులసిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా మనకు అనేక రకాల జబ్బుల నుండి ఉపశమనం పొందవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జలుబు, దగ్గు- తులసాకులను ప్రతిరోజు ఉదయాన్నే నాలుగు ఆకులు నమలడం వల్ల గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో యాంటీ వైరల్ గుణాల పుష్కలంగా ఉండడం ద్వారా వైరస్తో పోరాడడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా జ్వరం ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ప్రతిరోజు వీటిని తీసుకోవడం ద్వారా వైరల్ ఫీవర్లు గొంతు ఇన్ఫెక్షన్లు వంటివి తగ్గిపోతాయి.

Health Tips: అధిక వేడి ఉన్న నీరుతో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు..

ఆస్తమా- కొంతమందిలో ఆస్తమ సమస్యతో బాధపడుతుంటారు. అటువంటి వారికి తులసి ఆకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ప్రతిరోజు తులసికున్న తీసుకోవడం ద్వారా ఊపిరితుల పనితీరు పెరుగుతుంది. దీని ద్వారా శ్వాస కోసం సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. చాలామంది ఉబ్బసము ఇతర శ్వాస కొసల సమస్యల నుంచి బాధపడేవారు వీటిని తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడతారు.

జీర్ణ క్రియ- తులసి ఉండు తీసుకోవడం ద్వారా అజీర్ణం, గ్యాస్ ప్రాబ్లం ,మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి బయటపడతారు. ఇది మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి  ప్రేరేపిస్తుంది. దీని తీసుకోవడం ద్వారా మన జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.

షుగర్- మధుమేహ సమస్యతో బాధపడే వారికి తులసి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. తులసిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు చాలా మేలు చేస్తుంది.

గుండెకు మంచిది- తులసకుల్లో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంది. ప్రతిరోజు నాలుగు తులసాకులను తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా రక్తపోటు సమస్యతో బాధపడేవారు. తులసి కొండ నమలడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడతారు.

ఏ టైంలో తినాలి- ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నాలుగు నుంచి ఐదు తులసి ఆకులను నమలడం ద్వారా మన శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. అంటే కాకుండా వీటిని మనము ఆకులను ఉడకబెట్టి కషాయం లాగా చేసుకుని కూడా తీసుకోవచ్చు. తులసి, అల్లం, మిరియాలు కలిపి కషాయం చేసుకొని తాగినట్లయితే జలుబు దగ్గు వంటి వాటి నుంచి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif