Health Tips: చిలకడదుంపలు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
ముఖ్యంగా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అనేకారకాల ప్రయోజనాలు కలిగి ఉంటుంది.
చిలకడదుంపలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అనేకారకాల ప్రయోజనాలు కలిగి ఉంటుంది. శీతాకాలంలో విశ్వతంగా లభించే చిలగడ దుంపలు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఎన్ని లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము.
చిలగడ దుంపలోని పోషకాలు..
ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది అంతేకాకుండా ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది ఇందులో కార్బోహైడ్రేట్లు ఐరన్ ఫాస్పరసం మెగ్నీషియం పొటాషియం అంటే ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిమోగ్లోబిన్ ని పెంచుతుంది- మన శరీరంలో ఐరన్ హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. ప్రతిరోజు చిలకడదుంపలు తీసుకోవడం ద్వారా రక్త వృద్ధి పెరుగుతుంది. అంతేకాకుండా రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఉడికించిన చెలగాడదుంపని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
మెదడుకు మంచిది- ప్రతిరోజు చిలకడదుంపని తీసుకోవడం ద్వారా నరాల సంబంధ వ్యాధులు తగ్గుతాయి. దీని తినడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్నపిల్లల్లో జ్ఞాపకశక్తి లోపం పెద్దవాళ్లలో కూడా ఈ లోపం కనిపిస్తుంది. అటువంటివారు చిలగడ దుంపను ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడతారు.
Health Tips: ఈ చెడు అలవాట్లు మీకు కిడ్నీకి హాని కలిగిస్తాయి..
సంతానలేమి సమస్యలకు- ఈ మధ్యకాలంలో చాలామందిలో సంతాన ఉత్పత్తి రేటు తగ్గిపోతుంది. అటువంటివారు దుంపలు మీరు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా స్త్రీలలో పురుషుల్లో సంతాన ఉత్పత్తి రేటు పెరుగుతుంది. పురుషుల్లో దీన్ని తీసుకోవడం ద్వారా పెరుగుతుంది. మహిళల్లో సంతాన ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది.
జీర్ణశక్తికి మంచిది- ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఇందులో ఉండే ఫైబరు మెరుగుపరుస్తుంది. పేగులను శుభ్రం చేస్తుంది. వీటిని తినడం ద్వారా మనం తీసుకున్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది. మలబద్ధకం ,పైల్స్, ఫిస్టులా వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.
చర్మానికి మంచిది- చిలకడదుంపను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మీ చర్మం లో ఉన్న మలినాలని బయటకు పోయి చర్మం మృదువుగా తయారవుతుంది. మొహం పైన మచ్చలు, మొటిమలు వంటివి కూడా తగ్గుతాయి. చిలగడ దుంప పేస్ట్ ని మొహానికి అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు కూడా లభిస్తాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి