Health Tips: మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కనిపించే సంకేతాలు ఏంటో తెలుసా.

ముఖ్యంగా గుండె పోటు బ్రెయిన్ స్ట్రోక్ వంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి.

Lancet says one in eight people globally is now obese (Photo Credit: Pixabay)

మనకు వచ్చే అన్ని జబ్బులకు మొదటి కారణం కొలెస్ట్రాల్ చెరు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె పోటు బ్రెయిన్ స్ట్రోక్ వంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. అయితే కొలెస్ట్రాల అధికంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు ఎటువంటి సంకేతాలు కనిపించవు. అయితే కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్లయితే అధిక కొలెస్ట్రాల వల్ల మన శరీరము కొన్ని సంకేతాలను ఇస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చర్మం పైన మచ్చలు- కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కొన్నిసార్లు కొంతమందిలో తెలుపు ,పసుపుపచ్చ రంగులో మచ్చలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఇది కళ్ళ చుట్టూ మోచేతుల్లో కనిపిస్తాయి అధిక కొలెస్ట్రాల్ వల్ల కంటి చుట్టూ పసుపు రంగు రింగు కనిపిస్తుంది. ఇది కనిపించినప్పుడు వీరిలో అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు.

అలసట- కొంతమంది ఏ పని చేయకపోయినా చాలా అలసటగా అనిపిస్తుంది. ఇది కూడా అధిక కొలెస్ట్రాల్ కి కారణం కావచ్చు. వైద్య నిపుణుల ప్రకారం అధిక కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో రక్తప్రసరణకు అడ్డంకి కలుగుతుంది. దీని కారణంగా మన శరీరంలోని భాగాలకు ఆక్సిజన్ సరిగా అందదు. దీనివల్ల అలసట బలహీనత శక్తి లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీన్ని కూడా అధిక కొలెస్ట్రాల్ పెరిగింది అనడానికి సంకేతంగా చెప్పవచ్చు.

Health Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా 

చాతి నొప్పి- అధిక కొలెస్ట్రాల్ వల్ల ధమనులలో రక్త ప్రవాహం తగ్గుతుంది. దీని ద్వారా గుండెకు తగినంత ఆక్సిజన్ అందదు. అటువంటప్పుడు చాతి నొప్పి ఒత్తిడి బరువుగా అనిపిస్తుంది. దీన్నే యాంజినా అంటారు. శారీరక శ్రమ చేసే సమయంలో ఈ ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది కూడా కొలెస్ట్రాల్ పెరిగింది. అనడానికి సంకేతంగా చెప్పవచ్చు.

కాళ్లు చేతుల్లో తిమ్మిరి- ప్రతిరోజు కూడా మీ కాళ్లల్లో చేతుల్లో తిమ్మిర్లుగా చల్లదనంగా జలదరింపుగా అనిపించినట్లు అనిపిస్తే అది కూడా అధిక కొలెస్ట్రాల సంకేతం గా చెప్పవచ్చు.

రక్తపోటు- అధిక కొలెస్ట్రాల వల్ల ధమనులలో రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనికి ఆటంక కలుగుతుంది. దీనివల్ల గుండె మరింత ఒత్తిడితో రక్త ప్రవాహాన్ని చేయాల్సి ఉంటుంది. ఇవి అధిక రక్తపోటుకు దారితీస్తుంది. అధిక రక్తపోటు ఉన్నప్పుడు తల తిరగడం, తలనొప్పి ,వాంతులు, ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇది కూడా అధిక కొలెస్ట్రాల్ కు సంకేతం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి