Health Tips: బ్లాక్ కాఫీ నిజంగా బరువును తగ్గిస్తుందా..దీన్ని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి.
అలవంటి వారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా బరువు అనేది తగ్గించుకోవడం వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది.
ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు ఉబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలవంటి వారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా బరువు అనేది తగ్గించుకోవడం వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. వాకింగ్ ఎక్సర్సైజులు డైట్ వంటి వాటిలో కూడా వారు అనుకున్న బరువు తగ్గించుకోలేకపోతున్నారు. అటువంటి వారికి బ్లాక్ కాఫీ నిజంగా బరువును తగ్గిస్తున్న అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు ఉండటం వల్ల అనేక రకాల తీవ్రమైన వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధులు మధుమేహం బిపి వంటివి వస్తాయి. అయితే వీటన్నిటికీ కారణమైన అధిక బరువును తగ్గించుకోవడం కోసం బ్లాక్ కాఫీ ని తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
బ్లాక్ కాఫీలో ఉండే పోషకాలు- బ్లాక్ కాఫీలో ప్రోటీన్, ఎనర్జీ ,కాల్షియం, ఐరన్ మెగ్నీషియం, సోడియం, జింక్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ్లాక్ కాఫీలో ఉండే క్లోరోజనిక్ ఆసిడ్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
Health Tips: రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే మీ శరీరంలో ఏమవుతుంది
బ్లాక్ కాఫీ తాగితే నిజంగానే బరువు తగ్గుతారా- అవును బ్లాక్ కాఫీ ని తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న అధిక నీటిని తొలగించడంలో బ్లాక్ కాఫీ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తీసుకోవడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు త్వరగా తగ్గిపోతారు. బరువు తగ్గడానికి మీరు ఏదైనా అనుసరించే ముందు కచ్చితంగా మీ డైటీషియన్ ను లేదా పోషకాహారాన్ని ఇప్పుడు సంప్రదించడం ముఖ్యం. అయితే బ్లాక్ కాఫీ తాగడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి. బ్లాక్ కాఫీలో ఉండే కెఫెన్ శరీరానికి మేలు చేస్తుంది. ఇది సహజసిద్దంగా మనం మెదడుకు నాడీ వ్యవస్థను సులభతరంగా సక్యం చేయడానికి ఏకాగ్రతను పెంచడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు రెండు కప్పుల బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా శరీరంలో నాలుగు శాతం కొవ్వు తగ్గుతుందని పరిశోధనలో తేలింది.
బ్లాక్ కాఫీ తాగడానికి సరైన సమయం- అయితే బ్లాక్ కాఫీని ఖాళీ కడుపుతో తీసుకోవడం అంత మంచిది కాదు. దీని వల్ల గ్యాస్ ప్రాబ్లం, ఎసిడిటీ వంటివి ఏర్పడతాయి. ఒక్కొక్కసారి కడుపునొప్పి కూడా అనిపిస్తుంది. అందువల్ల మీరు బ్లాక్ కాఫీ తాగాలి అనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత బ్లాక్ కాఫీ ని తీసుకోవడం ద్వారా ఇది బరువు తగ్గడం తగ్గించడంలో సహాయపడుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి