Health Tips: జిమ్ చేసిన తర్వాత పొరపాటున కూడా ఈ 5 పదార్థాలు తినొద్దు... తింటే ఎంత ప్రమాదమో తేలుసా..

ఉదయం నిద్ర లేవగానే చాలా మంది మార్నింగ్ వాక్ లేదా జిమ్ లో వ్యాయామం ఇష్టపడతారు. వర్కౌట్ తర్వాత మనం ఏమి తినకూడదో నిపుణులు చెప్పారు

foods

మన  ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది మనం ఎంత వ్యాయామం చేస్తాం ,ఎలాంటి ఆహారం తీసుకుంటాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే చాలా మంది మార్నింగ్ వాక్ లేదా జిమ్ లో వ్యాయామం ఇష్టపడతారు. వర్కౌట్ తర్వాత మనం ఏమి తినకూడదో నిపుణులు చెప్పారు.

వ్యాయామం తర్వాత ఏ పదార్దాలు తినకూడదు?

వేయించిన ఆహారం: నూనేలో వేయించిన ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి, వీటిలో పోషకాలు ఉండవు. కాబట్టి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్‌ను మాని, బదులుగా కాల్చిన చికెన్ లేదా చేపలను తీసుకోవడం మంచిది. మీకు కావాలంటే మొలకలను పోస్ట్-వర్కౌట్ భోజనంగా చేర్చవచ్చు.

స్పైసి ఫుడ్: ఎక్కువ కారంగా ఉండే ఆహారం ఖచ్చితంగా మనం ఇష్టపడతాం. కానీ ఆరోగ్య పరంగా ఇది అస్సలు మంచిది కాదు, మీరు వ్యాయామం చేసిన తర్వాత దానిని తీసుకుంటే అది జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తుంది. గుండెల్లో మంట వస్తుంది . మసాలా దినుసులు ఎక్కువగా వండినట్లయితే, వాటిలోని పోషకాలు కూడా కోల్పోవడం ప్రారంభిస్తాయి. మసాలా ఎక్కువగా లేని వాటిని తినడం మంచిది.

స్వీట్ ఫుడ్: తీపి పదార్థాలు మనల్ని బాగా ఆకర్షిస్తాయి, ముఖ్యంగా స్వీట్లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీం, పుడ్డింగ్ తినడానికి ఇష్టపడతాము, కానీ వ్యాయామం చేసిన వెంటనే వాటిని తీసుకుంటే, వ్యాయామం ద్వారా మీరు తగ్గించిన కేలరీలు మళ్లి పెరిగి అధిక బరువు పెరుగుతారు.

మద్యం: ఆల్కహాల్ ఎల్లప్పుడూ ఆరోగ్యానికి శత్రువు, కానీ మీరు వ్యాయామం చేసిన తర్వాత దానిని తీసుకుంటే, ఇది గుండెకు కూడా హానికరం. మీరు నీరు, హెర్బల్ టీ ,ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే పానీయాలు తీసుకోవడం మంచిది.

 పచ్చి కూరగాయలు: పచ్చి కూరగాయలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, వ్యాయామం తర్వాత తింటే కడుపు ఉబ్బరం వస్తుంది. ఉడికించిన కూరగాయలు సులభంగా జీర్ణమవుతాయి. కాబట్టి ఉడికించిన కూరగాయలు తీసుకోవడం మంచిది.