Health Tips: పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల గుండె, క్యాన్సరు, మెదడు సంబంధ సమస్యలు తగ్గుతాయి..

ముఖ్యంగా ఇందులో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సరు, మతిమరుపు వంటి జబ్బులతో బాధపడే వారికి ఇది సహాయపడుతుందని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి.

Mushrooms-1

పుట్టగొడుగుల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సరు, మతిమరుపు వంటి జబ్బులతో బాధపడే వారికి ఇది సహాయపడుతుందని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుట్టగొడుగుల్లోని పోషకాలు- పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది తీవ్రమైన జబ్బులను తగ్గించే అవకాశం ఉంది. అంతేకాకుండా జబ్బులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్  తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ,గుండె జబ్బులు ,క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా చేస్తాయి.

మధుమేహం వారు తప్పకుండా తీసుకోవాలి- పుట్టగొడుగుల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంటే కాకుండా పుట్టగొడుగుల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్లు కూడా అధికంగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల డయాబెటిక్ రోగులకు ఇది చాలా మంచిది.

Health Tips: బ్లాక్ టీ మంచిదా బ్లాక్ కాఫీ మంచిదా తెలుసుకుందాం.. 

గుండె సమస్యలకు- గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా పుట్టగొడుగులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. క్యాలరీలు కూడా తక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధ జబ్బులు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. బీపీ రోగులకు కూడా పుట్టగొడుగులు చాలా మంచివి.

ప్రోటీన్ పుష్కలం- అన్ని రకాల పండ్లు కూరగాయలు తృణధాన్యాలతో పోలిస్తే పుట్టగొడుగుల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. పుట్టగొడుగుల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం ద్వారా ఇది బరువు తగ్గాలనుకునే వారికి చక్కటి వరంగా చెప్పవచ్చు. అంతేకాకుండా అధిక పొటాషియం ఉండడం వల్ల రక్తపోటు రోగులకు ఇది చక్కటి ఎంపిక.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి