Health Tips: ఈ ఆహార పదార్థాలను తరచుగా తీసుకుంటే మీకు గుండె సమస్యలు వచ్చే అవకాశం..

గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది మన శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.

source: pixabay

ఈ మధ్యకాలంలో చాలా మందిలో గుండె సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది మన శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఆక్సిజన్ కూడా రవాణా చేస్తుంది. మన శరీరంలో ఏదైనా లోపం ఉన్నప్పుడు గుండె బలహీనంగా మారుతుంది. సరైన ఆహారాన్ని తీసుకోకపోతే గుండెపోటు వచ్చేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం తీసుకున్న కొన్ని ఆహారాలు మన గుండె ఆరోగ్యానికి శత్రువుగా ఉంటాయి. కాబట్టి వాటిని మనం తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండెకు హాని కలిగించే ఆహార పదార్థాలు.

డీప్ ఫ్రై ఆహారాలు- నూనెలో వేయించిన ఆహారాలు గుండెకు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇందులో ఉన్న శాచ్యులేటెడ్ ఫ్యాట్స్ ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. దీని ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వేయించిన స్పైసీ ,నూనె ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది.

ఆల్కహాల్- ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్నిసార్లు గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మీరు ఆల్కహాల్ చేసే అలవాటు ఉన్నట్లయితే దాన్ని ఎంత తొందరగా మానివేస్తే మీ గుండె ఆరోగ్యానికి అంత మంచిది.

చిప్స్- చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ,సాల్టి ఫుడ్స్ లలో సోడియం లెవెల్ ఎక్కువగా ఉంటుంది. అధిక మొత్తంలో ఉప్పు తీసుకోవడం ద్వారా మనకు రక్తపోటు వచ్చే సమస్య పెరుగుతుంది. అంతేకాకుండా ఇది గుండెపోటు కూడా కారణం అవుతుంది. కాబట్టి చిప్స్ ,ఫ్రెంచ్ ఫ్రైస్, సాల్ట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకపోవడం గుండె ఆరోగ్యానికి మంచిది.

అధిక తీపి పదార్థాలు- ఎక్కువగా చక్కెర ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అధికంగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కేకులు ,స్వీట్స్ హల్వా వంటి వాటిని తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఒక్కొక్కసారి మధుమేహం పెరుగుతుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

Health Tips: బ్లాక్ కాఫీ నిజంగా బరువును తగ్గిస్తుందా..

మాంసాహారం- మాంసాహారంలో ప్రోటీన్ పుష్కలంగా ఉన్నాయి. అయితే దీని అధికంగా తీసుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇది జీనం అవ్వడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్డిటి గ్యాస్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి