Health Tips: పిల్లలకు అధికంగా పంచదార పదార్థాలను ఇస్తున్నారా..ఇది చాలా ప్రమాదకరం.

దీనివల్ల పిల్లల్లో అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు కలుగుతాయి.

Representative Image

చాలామంది పిల్లలకు ఎక్కువ పంచదార ఉన్న ఆహార పదార్థాలను ఇస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లల్లో అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు కలుగుతాయి. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చక్కెర అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇవ్వకూడదు. అధికంగా చక్ర ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల కొన్ని రకాలైనటువంటి  అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉబకాయం- చిన్నపిల్లల్లో చక్కర అధికంగా తీసుకోవడం వల్ల ఇది వారి ఎదుగుదలకు ఎంతో హానికరం కలిగిస్తుంది. చక్కెరలో క్యాలరీలు అధికంగా ఉండడం ద్వారా ఇది మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందించదు. ఇది క్యాలరీలు ఎక్కువగా ఉండటం ద్వారా జీర్ణం అవ్వడానికి సమయం పడి కొవ్వును నిల్వ ఉంచుకుంటుంది. దీని కారణంగా పిల్లల్లో అధిక బరువు పెరుగుతారు. దీనికి కారణంగా భవిష్యత్తులో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Health Tips: పాలతో పాటు ఈ 5 కూరగాయలను తింటున్నారా

దంత క్షయం- చక్కర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల పిల్లలలో పంటి సమస్యలు ఏర్పడతాయి. వారి దంతాల మీద ఉన్నటువంటి ఎనామిల్ తొలగిపోయి క్యాబిటీస్ ఏర్పడతాయి. కాబట్టి చక్కెర పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకు ఇవ్వకూడదు.

జీర్ణ క్రియ సమస్యలు - పంచదారని ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో జీర్ణం వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వారికి కడుపుబ్బరాన్ని, గ్యాస్ సమస్యలు, విరోచనాలు వంటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి పిల్లలకు చక్కెర పదార్థాలు ఇవ్వకూడదు.

ఇమ్యూనిటీ- అధిక మొత్తంలో చక్కెరను పిల్లను తీసుకోవడం ద్వారా వారి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది దీని కారణంగా పిల్లలు త్వరగా ఇన్ఫెక్షన్లకు గురవుతారు. చక్కరకు బదులుగా వారికి ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నటువంటి సమతుల్య ఆహారం ఇవ్వడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడతారు.

మానసిక ఆరోగ్యం- పిల్లలలో అధికంగా చక్కెర తీసుకోవడం ద్వారా మానసిక అభివృద్ధి కూడా తగ్గిపోతుంది. వారిలో మానసిక ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి చక్కెరకు బదులుగా సహజమైన పండ్లను ఇవ్వడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif