Health Tips: నాన్ వెజ్ తినకుండా మన శరీరానికి ప్రోటీన్ అందడం ఎలా ఈ ఆహారాలతో ప్రోటీన్ లోపం దూరం.
ప్రోటీన్ అంటే ముందుగా గుర్తొచ్చే ఆహార పదార్థాలు నాన్ వెజ్ చాపలు ,మాంసము, గుడ్లు అయితే కొంతమంది మాంసాహారం వంటివి తినడానికి ఇష్టపడరు అటువంటి వారిలో ప్రోటీన్ లోపం అనేది కనిపిస్తుంది.
ప్రోటీన్ అంటే ముందుగా గుర్తొచ్చే ఆహార పదార్థాలు నాన్ వెజ్ చాపలు ,మాంసము, గుడ్లు అయితే కొంతమంది మాంసాహారం వంటివి తినడానికి ఇష్టపడరు అటువంటి వారిలో ప్రోటీన్ లోపం అనేది కనిపిస్తుంది. అయితే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలతో ప్రోటీన్ లోపానికి పరిష్కారం వెతకవచ్చు. కొన్ని ఆహార పదార్థాలు లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ ని అందించి శరీరానికి కావాల్సిన శక్తిని కండరాల బలోపేతానికి సహాయపడుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు.
జామకాయ- జామకాయలు విటమిన్ సి తో పాటు ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ పండును ప్రతి రోజు తీసుకున్నట్లయితే ఇందులో ప్రోటీన్ మన శరీరానికి కావాల్సినంత అందుతుంది. ఇది సలాడ్ రూపంలో లేదా జ్యూస్ రూపంలో పండు రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జామపండును తీసుకున్నట్లయితే మీకు సుమారు రెండు నుంచి మూడు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.
Health Tips: రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే మీ శరీరంలో ఏమవుతుంది
ఖర్జూరాలు- ఖర్జూర పండ్లు కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఖర్జూరాలను ఆహారంలో భాగం చేసుకుంటారు. 100 గ్రాముల ఖర్జూర పండులో 2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉండడం ద్వారా మలబద్ధకం కడుపునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
ఎండు ద్రాక్ష- ఎండు ద్రాక్షాలు కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఎండు ద్రాక్ష తీసుకున్నట్లయితే మన శరీరానికి కావాల్సిన శక్తిని కాల్షియం, ఐరన్ ను అందిస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్ లోపల తో బాధపడేవారు. ఎండుద్రాక్షను తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. 100 గ్రాముల ఎండు ద్రాక్షలో 3 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి దీని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ప్రోటీన్ లోపం ఉండదు.
అంజీర్- అంజీర్ పండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రోటీన్ ఒక గొప్ప మూలంగా చెప్పవచ్చు. వీటికి తీసుకోవడం ద్వారా మనకు కావాల్సిన అనేక రకాల విటమిన్లు మినరల్స్ లభిస్తాయి. 100 గ్రాముల అంజీర్ పండును తిన్నట్లయితే దాదాపు మూడు నుంచి నాలుగు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అంతేకాకుండా ఏడు గ్రాముల డైరీ ఫైబర్ కూడా లభిస్తుంది. దీని ద్వారా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి సోర్స్ గా చెప్పవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి