Health Tips: డయాబెటిస్ ముదిరితే కంటి చూపు పోతుందా...షాకింగ్ విషయాలు తెలుసుకోండి..?

వాళ్లు కంటి సమస్యతో బాధపడుతున్న కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పూర్తిగా కంటిచూపును కోల్పోయే అవకాశాలు ఉంటాయి.

Eyes (Photo Credits: Pixabay)

ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో మధుమేహం సమస్య ఒకటి. ఒకసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మధుమేహం సమస్యతో బాధ పడేవాళ్లు ఎక్కువగా కంటి సంబంధిత సమస్యలతో వేధించే అవకాశం ఉంటుంది. వాళ్లు కంటి సమస్యతో బాధపడుతున్న కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పూర్తిగా కంటిచూపును కోల్పోయే అవకాశాలు ఉంటాయి.

మధుమేహం సమస్యతో బాధ పడేవాళ్లను కంటి శుక్లం, నరాల పక్షవాతం, గ్లాకోమా సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇంకా కొంతమంది కంటిసమస్యలతో బాధపడేవారు డ్రై ఐ సిండ్రోమ్ సమస్యతో బాధపడే అవకాశం ఉంటుంది. కళ్లకు తగినంత లూబ్రికేషన్ అందకపోవడం వల్ల ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వచ్చిన వారిలో కళ్లు బాక్టీరియా దాడికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ సమస్య బారీన పడితే కార్నియాపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. కళ్లో జిగట, నీరు కారుట, ఎర్రటి కన్ను, అస్పష్టమైన దృష్టి, ఫోటోఫోబియా లాంటి సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యచికిత్స చేయించుకోవడం చాలా మంచిది. . పదేళ్ల పైగా షుగర్ తో బాధపడేవాళ్లకి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో బాత్ రూమ్ ఏ దిశలో ఉండాలో తెలుసా ...

టైప్ -2 డయాబెటిస్ ఉన్న రోగులు ఈ సమస్య వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. కార్ టికోస్టెరాయిడ్స్, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, సైక్లోస్పోరిన్ మందులను వాడటం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.వైద్యుల సలహాలు తీసుకొని మందులు వాడటం ద్వారా మంచి ఫలితాయి పొందవచ్చు అని వైద్యులు తెలియజేస్తున్నారు.