Health Tips: నిద్ర తక్కువగా పోతున్నారా అయితే గుండెపోటు వచ్చే సమస్యలు మీకు చాలా ఎక్కువ..
ముఖ్యంగా పని ఒత్తిడి వంటి కారణాలవల్ల నిద్రలేమి అనే సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది.
ఈరోజుల్లో చాలామందిలో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పని ఒత్తిడి వంటి కారణాలవల్ల నిద్రలేమి అనే సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. అయితే నిద్రలేమి వల్ల గుండె సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేమి వల్ల గుండెకు ప్రమాదం- మంచి నిద్ర వల్ల మన శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అంతేకాకుండా ఇది గుండెకు కూడా మంచిది. నిద్రలేమి వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Health Tips: జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా,
గుండెకు నిద్రకు మధ్య సంబంధం- మన శరీరానికి తగినంత విశ్రాంతి లేనప్పుడు మన శరీరంలో కార్టి సాల్, అడ్రినల్ అనేటువంటి ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఈ ఒత్తిడి హార్మోన్ల వల్ల రక్తపోటు సమస్య పెరుగుతుంది. దీని కారణంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శరీరానికి కచ్చితంగా రోజులో 8 గంటల నిద్ర అవసరం దీని ద్వారా ఒత్తిడి కలిగించే హార్మోన్ల పనితీరు తగ్గుతుంది.
నిద్రలేమి వల్ల వచ్చే ఇతర వ్యాధులు- నిద్రలేమి వల్ల బరువు పెరుగుతారు. అంతేకాకుండా ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలో అసమానతలు కలుగుతాయి. దీనివల్ల షుగర్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రా స్థాయిలు కూడా పెరుగుతాయి.
తగ్గించుకునే. మార్గాలు.
ఆరోగ్యకరమైన ఆహారాలు- ఎల్లప్పుడు కూడా తాజా ఆహార పదార్థాలు కూరగాయలు తిన్నట్లయితే అనేక రకాల జబ్బుల నుండి బయటపడవచ్చు.
యోగ ధ్యానం- తగ్గించుకోవడం కోసం ప్రతి రోజు యోగ ప్రాణాయామం వంటివి చేసినట్లయితే ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించుకోవడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి