Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే మీకు విటమిన్ బి 12 లోపం ఉన్నట్లే.

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి అనేక రకాల పోషకాలు విటమిన్లు అవసరం వాటి లోపం వల్ల మన శరీర వ్యవస్థ దెబ్బతింటుంది.

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి అనేక రకాల పోషకాలు విటమిన్లు అవసరం వాటి లోపం వల్ల మన శరీర వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా విటమిన్లలో మన శరీరానికి అత్యంత అవసరమైనది. విటమిన్ బి ఇందులో విటమిన్ బి12 అనేది చాలా ముఖ్యమైనది. ఇది అనేక రకాల జబ్బులు నుండి రక్షిస్తుంది. విటమిన్ బి12 లోపం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శాఖాహార ఆహారం తీసుకునే వారిలో తరచుగా విటమిన్ బి 12 లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. విటమిన్ బి12 వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రక్తహీనత- విటమిన్ బి12 శరీరంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైనది. విటమిన్ బి12  లోపం వల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. దీని కారణంగా ఎనీమియా ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత అనేది రక్త లోపానికి సంబంధించిన తీవ్రమైన వ్యాధి. దీని వల్ల అలసట బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి.

Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా 

నరాల సమస్యలు- కొంతమందిలో విటమిన్ బి12 లోపం వల్ల నరాల పనితీరు దెబ్బతింటుంది. దీనివల్ల మెదడు నరాల వాపు బలహీనత, మైకము, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం నిరాశ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోపోతే ఈ పరిస్థితి తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..

ఆందోళన- విటమిన్ బి12 లోపం వల్ల ఒత్తిడి ఆందోళన వంటి సమస్య కూడా పెరుగుతాయి. వీరిలో తలనొప్పి కళ్ళు తిరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. రోజువారి విషయాలు కూడా కొన్ని గుర్తుపెట్టుకో లేని స్థితికి వెళతారు. ఇది మానసిక వ్యాధిగా చెప్పుకోవచ్చు.

విటమిన్ బి12 లోపం లక్షణాలు..

రక్తహీనత ,విపరీతమైన అలసట, బలహీనత, నడుస్తున్నప్పుడు మెట్లెక్కుతున్నప్పుడు తుగుతున్న అనుభూతి ,ఆకలి లేకపోవడం ,ఎముకలు కాళ్లలో నొప్పి ,గోర్లలో నొప్పి, గాయాలు తొందరగా నయం కాకపోవడం వంటి లక్షణాలు విటమిన్ బి12 లోపం సంకేతాలుగా చెప్పవచ్చు.

విటమిన్ బి12  వలన ఆహార పదార్థాలు.

విటమిన్ బి12  ఆహార పదార్థాలు శాకాహారంతో పోలిస్తే మాంసాహారంలో ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా పాలు పాల ఉత్పత్తుల్లో ఉంటుంది. క్యారెట్, బ్రొకోలీ, ఆకుకూరలు వంటి వాటిలలో ఉంటుంది, పైన ఆపిల్, ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ లో ఉంటుంది. ముఖ్యంగా చేపలు, చికెన్, మటన్ ,గుడ్లు వంటి వాటిలలో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif