Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే మీకు విటమిన్ సి లోపం ఉన్నట్లే.
ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. అనేక రకాలైనటువంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
విటమిన్ సి మన శరీరానికి కావాల్సిన ఒక ముఖ్యమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. అనేక రకాలైనటువంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. అలసట తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్లను, చర్మ సమస్యలను బలహీనత వంటి సమస్యలను తగ్గిస్తుంది. అయితే అయితే మీ శరీరంలో ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నట్లయితే అది సి విటమిన్ లోపం కావచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నీరసం, బలహీనత- నీరసం అలసటగా అనిపించడం కూడా సి విటమిన్ సాధారణ లోపం గా చెప్పవచ్చు. దీనివల్ల మనం రోజువారి చేసే పనుల పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. తరచు తరచుగా మీకు అలసిపోయినట్లుగా అనిపించడం నీరసంగా అనిపిస్తే సి విటమిన్ లోపం సంకేతం కావచ్చు.
అంటు వ్యాధులు- పదేపదే తరచుగా అంటువ్యాధులు రావడం కూడా సి విటమిన్ లోపం వల్ల కావచ్చు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సి విటమిన్ అనేది సహాయపడుతుంది. మీ శరీరంలో విటమిన్ సి లోపం ఉన్నట్లయితే మీరు తరచుగా ఇన్ఫెక్షన్లకు వ్యాధులకు గురికావాల్సి వస్తుంది. తరచుగా వచ్చే జలుబు దగ్గు ఫ్లూ వంటి వ్యాధులు సి విటమిన్ లోపానికి ప్రధాన సంకేతం.
చర్మ సమస్యలు- విటమిన్ సి లోపం వల్ల మన చర్మానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా చర్మం పొడిబారడం గ్లో లేకపోవడం వంటివి కనిపిస్తాయి. పెదవులు పగిలిపోవడం చుట్టూ పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో విటమిన్ సి లోపం వల్ల కొల్లాజిన్ అనేది తగ్గుతుంది. దీని ద్వారా మీకు వృద్ధాప్య ఛాయలు వస్తాయి.
చిగుళ్ల నుండి రక్తస్రావం- మీ దంతాలు చిగుళ్ల నుండి రక్తస్రావం అవ్వడం కూడా విటమిన్ సి లోపానికి ప్రధాన సంఖ్యలు చెప్పవచ్చు. మీ దంతాల ఆరోగ్యానికి చిగుళ్ల గట్టిదనానికి విటమిన్ సి అనేది చాలా ముఖ్యమైన విటమిన్ కాబట్టి సి విటమిన్ లోపం వల్ల కాలక్రమమైన మీ దంతాలు కూడా దెబ్బతింటాయి.
Health Tips: పిల్లలకు ఎక్కువగా బిస్కెట్లు ఇస్తున్నారా..
గాయాలు తొందరగా నయం అవ్వవు- విటమిన్ సి తక్కువగా ఉండటం వల్ల గాయాలు మానడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. గాయం తర్వాత చర్మం త్వరగా ఏర్పడడానికి సి విటమిన్ లోపం వల్ల ఈ సమస్య మరింతగా ఇబ్బంది పెడుతుంది మీ చర్మం పైన నీలం రంగులు గుర్తులు కనిపించినట్లయితే అది విటమిన్ సి యొక్క లోపం గా చెప్పవచ్చు.
విటమిన్ సి లోపాన్ని తగ్గించే మార్గాలు
విటమిన్ సి లోపాన్ని తగ్గించడానికి మనం తీసుకునే ఆహారంలో ఈ పదార్థాలను చేర్చుకున్నట్లైతే ఈ విటమిన్ లోపం నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా సిట్రస్ పండ్లను అయినా నారింజ నిమ్మకి ద్రాక్ష వంటి పనులను తీసుకోవడం ద్వారా మీకు ఈ విటమిన్ లభిస్తుంది. ఆకుకూరలను అధికంగా తీసుకోవడం వల్ల సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. జామపండు స్ట్రాబెరీస్ వంటివి తీసుకోవడం వల్ల సి విటమిన్ అధికంగా లభించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా విటమిన్ సి సప్లిమెంట్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వైద్యుని సలహా మేరకు తగినంత మోతాదులో విటమిన్ సి మాత్రలను తీసుకోవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి