Health Tips: జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా ,అయితే ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారాలు తీసుకోకూడదు తెలుసుకుందాం.
ఈ సీజన్ లో ఎక్కువగా గొంతు ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
చలికాలం వచ్చిందంటే చాలు చాలామందిలో గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్లు, జలుబు వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈ సీజన్ లో ఎక్కువగా గొంతు ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దీనికి కారణం బ్యాక్టీరియా, వైరస్ వల్ల వస్తుంది. అయితే చల్లగాలి ,పొడిగాలి వల్ల వాతావరణంలో మార్పుల వల్ల ఈ సమస్యలు ఒక్కొక్కసారి తీవ్ర రూపం దాలుస్తాయి. గొంతు ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి మనము కొన్ని ఆహార పదార్థాలను మానివేయాలి. అంతే విధంగా కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి
సిట్రస్ పండ్లు- గొంతు ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్రస్ పండ్లను తీసుకోకూడదు. నిమ్మ, నారింజ, ద్రాక్ష పండ్లను తీసుకోవడం ద్వారా గొంతులో ఇన్ఫెక్షన్ మరింతగా పెరుగుతుంది. గొంతు వాపు కూడా కారణం అవుతుంది. వీటిలో ఉన్న ఎసిడిక్ నేచర్ మరింతగా చికాకు పెడుతుంది .
స్పైసీ ఆహారాలు- నూనె ఎక్కువగా ఉన్న మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా గొంతులో ఇన్ఫెక్షన్ మరింతగా పెరుగుతుంది. ఇది గొంతులో వచ్చే చిరాకును ఇంకా పెంచేలా చేస్తుంది. స్పైసి ఫుడ్ తీసుకోవడం ద్వారా ఇప్పటికే ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడే వారికి సులభంగా జీర్ణం అయ్యే సూపు, కిచిడి, ఉప్మా వంటి ఆహారాలు తీసుకోవడం మంచిది.
Health Tips: మీరు భోజనం చేసేటప్పుడు చెమట ఎక్కువగా పడుతుందా,
కూల్ డ్రింక్స్- గొంతు ఇన్ఫెక్షన్ ,గొంతు వాపు సమస్యతో బాధపడేవారు ఐస్ క్రీమ్ వంటి వాటిని తీసుకోకుండా ఉంటేనే మంచిది. వీటిని తీసుకోవడం ద్వారా మీ సమస్య ఇంకా పెరుగుతుంది. చల్లటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా వాపు ఇన్ఫెక్షన్ మరింతగా పెరుగుతుంది. కాబట్టి వీటిని తీసుకోవడం మానివేయాలి.
ఏ ఆహారపదార్థాలు తీసుకోవాలి
గోరువెచ్చని నీరు- చల్లటి వాతావరణంలో ఎప్పుడు కూడా మనం హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం. తరచుగా చలికాలంలో చాలామంది తక్కువ నీరును తాగుతూ ఉంటారు. గొంతు ఇన్ఫెక్షన్ సమస్యలు వచ్చినప్పుడు గోరువెచ్చటి నీటిని తరచుగా తీసుకున్నట్లయితే గొంతుకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
తేనే, అల్లం- మీరు గొంతు ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నట్లయితే అల్లంలో తేనె కలుపుకొని తీసుకున్నట్లయితే గొంతు ఇన్ఫెక్షన్ సమస్య తగ్గుతుంది. తేనే ,అల్లం లో యాంటీబ్యాక్టీరియల్ గుణాల పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా అల్లము గొంతు వాపును తగ్గిస్తుంది. తేనెలో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి