IPL Auction 2025 Live

Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే కాఫీ తో మీ సమస్యకు పరిష్కారం..

ఎవరంటే కాలేయంలో అదనంగా కొవ్వు పేరుకుపోయే పరిస్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు.

liver

ఈ మధ్యకాలంలో చాలామందిలో జీవనశైలిలో మార్పు, ఆహారపు అలవాట్లలో అనేక రకాల మార్పుల వల్ల వారిలో ఫ్యాటీ లివర్ సమస్య అనేది ఏర్పడుతుంది. ఎవరంటే కాలేయంలో అదనంగా కొవ్వు పేరుకుపోయే పరిస్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు. ఇది ముఖ్యంగా మద్యం సేవించడం వల్ల ఎక్కువగా బయట ఆహార పదార్థాలు తీసుకోవడం శారీరక శ్రమ తక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. అయితే ఫ్యాటీ లివర్ ఉన్నవారికి కాఫీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి- ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేర్కొన్నప్పుడు దాన్ని ఫ్యాటి లివర్ కింద అని అంటారు. ఇది ఎక్కువగా అధిక బరువు ఉన్నవాళ్లలో ,ఎక్కువగా జంక్ ఫుడ్ ,ఆయిల్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ తీసుకునే వారిలో ధూమపానం ,మద్యపానం అలవాట్లు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు వి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్ర కడుపునొప్పి, అలసట, వాంతులు, వికారం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలను సూచిస్తుంది.

ఫ్యాటి ఇవన్నీ తగ్గించడంలో కాఫీ ప్రయోజనకరంగా పనిచేస్తుంది..

యాంటీ ఆక్సిడెంట్లు- కాఫీలో ఫాలీ ఫైనాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి సహాయపడతాయి. అంతేకాకుండా మన కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కాలయ వాపును తగ్గించడంలో కూడా కాఫీ సహాయపడుతుంది

ఎంజైములను ఉత్పత్తి చేస్తుంది- కాఫీలో కొన్ని రకాలైన ఎంజైములు ఉంటాయి. ఇవి కాలేయాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా కాలేయంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కాఫీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

Health Tips: అరటిపండు ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుం

వాపును తగ్గిస్తుంది- కాఫీలో క్లోరోజనిక్ యాసిడ్ ,కెఫెన్ వంటి అంశాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి కాలేయంలో ఏర్పడేటువంటి వాపును మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. కాఫీ తీసుకోవడం ద్వారా కాలేయం పనితీరును కూడా మెరుగుపరుచుకోవచ్చు.

ఏ కాఫీ మంచిది- మామూలు కాఫీ తో పోలిస్తే బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఫ్యాటీలివర్ పై అత్యంత ప్రయోజనకరంగా పనిచేస్తుంది. బ్లాక్ కాఫీలో చెక్కర ,పాలు ఉండవు కాబట్టి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎంజైన్సు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు కాఫీ ఎప్పుడు తీసుకోవాలనుకున్న కూడా బ్లాక్ కాఫీ తీసుకోవడం ఉత్తమం. ఇది కాలేయానికి శుభ్రంగా ఉంచి కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీ ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను 70% వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి