Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్య మళ్లీ మళ్లీ వేధిస్తుందా అయితే ఈ తప్పులే కారణం కావచ్చు..
కిడ్నీలో రాళ్లు వచ్చినప్పుడు ఆ సమస్య చాలా బాధాకరంగా ఉంటుంది.ముఖ్యంగా కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు, చలి జ్వరము వంటి సమస్యలు ఏర్పడతాయి.
కిడ్నీలో రాళ్లు రావడం అనే సమస్య ఈమధ్య తరచుగా అందరిలో చూస్తూ ఉన్నాము. కిడ్నీలో రాళ్లు వచ్చినప్పుడు ఆ సమస్య చాలా బాధాకరంగా ఉంటుంది.ముఖ్యంగా కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు, చలి జ్వరము వంటి సమస్యలు ఏర్పడతాయి. యాసిడ్ ఆక్సలైట్ లో క్యాల్షియం వంటివి మన మూత్రపిండాల్లో స్పటికాల రూపంలో పేరుకుపోయినప్పుడు కిడ్నీలో రాళ్లు రావడం అని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొంతమందిలో ఇది ఒకసారి నయమైతే కొంతమందిలో మాత్రం తిరిగి తిరిగి వస్తుంది. అయితే మనం చేసే కొన్ని తప్పుల వల్ల కిడ్నీలో సమస్య మరల మరల ఇబ్బంది పెడుతుంది. వాటికి కారణాలు ఏంటి నివారణ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీలో రాళ్లు తరచుగా రావడానికి కారణం..
తక్కువ నీరు త్రాగడం- మన శరీరంలో నీరును తక్కువగా తీసుకున్నప్పుడు మూత్రపిండాల్లో ఈ స్పటికాలు ఖనిజాలు పేర్కొని పోతాయి. ఇవి క్రమంగా రాళ్లుగా మారుతాయి.. కాబట్టి మనం శరీరానికి తగినంత నీరు ఇవ్వాలి. మీరు తక్కువ అయినప్పుడు సరిగ్గా సాగినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల మీకు తరచుగా రాళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువ.
ఆహారపు అలవాట్లు- ఎక్కువగా చక్కెర, ఉప్పు, అధిక ప్రోటీన్, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు తరచుగా ఏర్పడతాయి. బచ్చలి కూర, చాక్లెట్, మాంసంహారము, ఆక్సలైట్లు యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Health Tips: సయాటికా నొప్పితో బాధపడుతున్నారా,
జెనిటిక్- కుటుంబంలో ఎవరికైనా కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే ఆ సమస్య ఆ కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది జన్యుపరమైన సమస్యగా చెప్పవచ్చు.
ఈ జబ్బుల వల్ల- కొంతమందిలో బిపి షుగర్ కడుపు సమస్యలు వంటివి ఉంటాయి. ఇవి కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారణాలు అవుతాయి.
విటమిన్ డి అధికంగా తీసుకోవడం- కొంతమంది విటమిన్ డి ని సప్లిమెంట్స్ రూపంలో అధికంగా తీసుకుంటారు. దీన్ని తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఎందుకంటే ఇది క్యాల్షియం పెంచుతుంది ఇది తరువాత రాళ్లుగా మారుతాయి.
కిడ్నీ ఇన్ఫెక్షన్స్- కొంతమందిలో తరచుగా కిడ్నీ ఇన్ఫెక్షన్ల సమస్య ఏర్పడుతుంది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా తరచుగా వారిలో కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడతాయి.
తగ్గించుకోవడం ఎలా- కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే రోజుల్లో కనీసం 3నుంచి 4లీటర్ల నీరు తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు కొవ్వు చక్కరలు లేకుండా చూసుకోవాలి. బరువు పెరగడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ల సమస్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బరువును ఎప్పుడు కూడా నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. మీకు కిడ్నీ సమస్యలలో ఓ రాళ్లు ఉన్నట్టు అనిపించినట్లయితే క్రమం తప్పకుండా వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి