IPL Auction 2025 Live

Health Tips: మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఈ కషాయాలతో సమస్యకు పరిష్కారం.

ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా ఒక్కసారి సంభవిస్తాయి.అయితే ఇది ఏ వయసులో వారిని అయినా ప్రభావితం చేస్తుంది.

Joint bone | Representational Image (Photo Credits: Pixabay)

దీర్ఘకాలికంగా చాలామందిలో మోకాళ్ళ నొప్పుల సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంది. ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా ఒక్కసారి సంభవిస్తాయి.అయితే ఇది ఏ వయసులో వారిని అయినా ప్రభావితం చేస్తుంది. ఈమధ్య కాలంలో ఎక్కువగా ఈ సమస్య వినిపిస్తుంది. దీనికి కారణాలు చూసినట్లయితే జీవనశైల్లో మార్పులు మారిన ఆహారప అలవాట్లు వల్ల ఈ సమస్య మరింతగా కనిపిస్తుంది. నొప్పి నుంచి బయటపడడానికి చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అయితే ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ని కలిగి ఉంటాయి. అలా కాకుండా కొన్ని ఇంటిలోనే చేసుకునేటువంటి కషాయాల ద్వారా నొప్పి ప్రభావం తగ్గుతుంది. అటువంటి మూడు రకాలైనటువంటి కషాయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని తీసుకోవడం ద్వారా ఎప్పటినుంచో ఉన్న మోకాళ్ళ నొప్పుల సమస్య నుండి బయటపడవచ్చు.

అల్లం కషాయం-  అల్లం సహజ నొప్పి నివారణగా పనిచేస్తుంది. అదే కాకుండా పసుపు కూడా పసుపులో కూడా సహజంగా నొప్పిని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల నొప్పులు తగ్గుతాయి. పసుపులో కర్కుమిన్ అనేది నొప్పిని తగ్గిస్తుంది. ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గుతుంది. అల్లం కషాయంలో పసుపు కలిపి తీసుకోవడం వల్ల మన రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఒక చిన్న ముక్క అల్లం అదేవిధంగా ఒక టీ స్పూన్ పసుపును రెండు గ్లాసుల నీటిలో పోసుకొని మరిగించుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ తేనెను కలుపుకొని ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్య నుండి బయటపడతారు.

అవిస గింజల కషాయం- అవిస గింజలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి సహాయపడుతుంది. ఇది ఎముకలను మధ్య జిగురు పదార్థాన్ని పెంచి మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తాయి. అవిస గింజలను వేయించుకొని పొడి చేసుకుని ఆ పొడిని రెండు గ్లాసుల నీటిలో ఒక టీ స్పూన్ అవిస గింజల పొడి వేసుకొని పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని తీసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.

కొత్తిమీర రసం- కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీర తీసుకొని దాన్ని మిక్సీలో వేసి జ్యూస్ లాగా చేయండి. దీనిని ఖాళీ కడుపుతో ప్రతిరోజు తీసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనాన్ని పొందుతారు. మీరు రోజువారి ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల నొప్పి తగ్గడమే కాకుండా మీ మోకాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి