Health Tips: జామపండు తింటే కలిగే ఉపయోగాలు తెలిస్తే...షాక్ తినడం ఖాయం..

ముఖ్యంగా జామలో ఐరన్, ఫైబర్, విటమిన్ సి లు అధికంగా ఉండటంతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.

guava (File)

శీతాకాలంలో జామపండ్లు అన్ని ప్రాంతాల్లో లభిస్తాయి. జామపండు ఎంత రుచికరమైనదో, ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. శరీరంలో ఉండే కొవ్వును తగ్గించడం, బరువును నియంత్రించడంలో జామ అద్భుతంగా పనిచేస్తుంది. జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మనలో చాలా మంది జామకాయలు ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి విదితమే. జామకాయలను తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా... అదే విధంగా షుగర్ సమస్యతో బాధపడేవాళ్లు జామకాయలను తినడం వలన శరీరంలో ఉండే షుగర్ సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు.

డయాబెటిస్ ఒక విధంగా సైలెంట్ కిల్లర్ అనే సంగతి తెలిసిందే. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో లేకపోతే శరీరంలో ఉండే వేర్వేరు అవయవాలపై ప్రభావం చూపుతుంది. కిడ్ని, నరాలు, కంటి సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు షుగర్ కారణం అవుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ.. పోషికాహారం తీసుకోవడం వలన షుగర్ కి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.జామకాయలో పోషకాలు పుష్కలంగా ఉండడం వలన షుగర్ పేషంట్లకు ఇది ముఖ్యఔషదం అని చెప్పవచ్చు. ముఖ్యంగా జామలో ఐరన్, ఫైబర్, విటమిన్ సి లు అధికంగా ఉండటంతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.

ఇంకా టైప్-2 డయాబెటిస్ రోగులకు జామలో ఉండే పోషకాలు ఎంతో మేలును కలుగచేస్తాయి. శరీర బరువును తగ్గించడంలో జామ కీలకపాత్ర వహిస్తుంది. జామలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆకలి తగ్గడంతో పాటు అతిగా తినడాన్ని కూడా నియంత్రిస్తుందని నిపుణులు చెప్తున్నారు. జామలో ఉండే పోషకాలు హైపర్ టెన్షన్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. డయాబెటిస్ వల్ల జీర్ణసంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

ప్రధానంగా జామలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వలన అనేక లాభాలు చేకూరుతాయి. శరీర కణాలకు ఫ్రీరాడికల్స్ నుంచి రక్షించడంతో పాటు రాల సమస్యను తగ్గించడంతో జామ ఎంతగానో ఉపయోగపడుతుంది. జామపండ్లను తినడం వలన లాభాలే తప్ప నష్టాలు లేవనే సంగతి మనకు తెలిసిందే. ఇంకా ప్రతిరోజు మనం తినే ఆహారంలో జామను ఆహారంలో భాగం చేసుకుంటే కావాల్సినంత ఫలితాలు అందుతాయని తెలుస్తుంది.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...