Health Tips: మీరు భోజనం చేసేటప్పుడు చెమట ఎక్కువగా పడుతుందా, అయితే అది ఈ వ్యాదుల సంకేతాలు కావచ్చు.

దీనికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని సార్లు ఈ సమస్య ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

Standing while eating (Credits: X)

కొంతమందిలో తినేటప్పుడు తిన్న తర్వాత చాలా ఎక్కువగా చెమటలు వస్తూ ఉంటాయి. దీనికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని సార్లు ఈ సమస్య ఇబ్బందికరంగా అనిపిస్తుంది. బయట ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు జంక్ ఫుడ్, స్పైసి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా అవుతుంది. అయితే తినేటప్పుడు చెమటలు రావడం అనేది ఈ వ్యాధుల సంకేతంగా చెప్పవచ్చు.

మధుమేహం- మధుమేహ సమస్య ఉన్నవారు వీరు భోజనం చేసేటప్పుడు కొన్నిసార్లు చెమట ఎక్కువగా పడుతుంది. అంతేకాకుండా వీరికి తల తిరగడం వంటి సమస్య ఏర్పడుతుంది. అప్పుడు వీరి శరీరంలో చక్కెర స్థాయిలో మారుతుంటాయి.  వీరి శరీరంలో గ్లూకోస్ లెవెల్స్ తగ్గడం వల్ల వీరికి అధికంగా చెమటలు పోయడం కళ్ళు తిరగడం, బలహీనంగా అనిపించడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

హైపోథైరాయిడ్- హైపోథైరాయిడిజం విషయంలో శరీరంలో జీర్ణ క్రియ మందగిస్తుంది. కాబట్టి వీరు తీసుకునేటప్పుడు ఆహారము సరిగ్గా జీర్ణం అవ్వదు. దీనివల్ల వీరికి చెమటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కడుపునొప్పి వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.

గుండె జబ్బులు- గుండె సమస్యలు ఉన్నవారిలో కూడా తినేటప్పుడు అధికంగా చెమట పడుతుంది. ఎందుకంటే గుండెకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అందనప్పుడు రక్తప్రసన్నలో సమస్యలు తలెత్తినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణ క్రియ ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వీరికి తినేటప్పుడు కాస్త చిరాకుగా చెమటలు పట్టడం అనిపిస్తూ ఉంటుంది. అటువంటి అప్పుడు వీరికి గుండె జబ్బు ఉందని సూచన.

Health Tips: హైపోథైరాయిడిజం అంటే ఏమిటి దీని లక్షణాలు, నివారణ చర్యలు ...

ఎసిడిటీ- కొన్నిసార్లు మనం ఆహారాన్ని అధికంగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య ఉన్న వారిలో కూడా అధిక చమటలు పోసే అవకాశం ఉంటుంది. ఇది వారు తీసుకున్న ఆహారము వారి శరీరంలో ఉన్న ఆసిడ్స్ తోటి రియాక్షన్ జరపడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

చికిత్స- ఇటువంటివారు వారు తీసుకునే ఆహారంలో ఎక్కువగా నీరు ఉండేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు వంటి వాటిని అధికంగా తీసుకోవాలి. అంతేకాకుండా తాజాగా వండిన కూరగాయలు మాత్రమే తినాలి. మాంసాహారానికి దూరంగా ఉంటే చాలా మంచిది. శరీరాన్ని కూడా ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచుకోవాలి. వ్యాయామం చేయాలి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను జంక్ ఫుడ్ లకు దూరంగా ఉంటే అధికంగా చెమట పోయడం అనే సమస్య నుంచి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి