Health Tips: మైదా పిండిని అధికంగా వాడుతున్నారా అయితే ఈ జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.

మైదాని తీసుకోవడం వల్ల ఇది మన శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. ఆల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్ గా మైదాని అంటారు.

మనం తీసుకునే ఆహారంలో బ్రెడ్, బిస్కెట్లు, కేకుల అన్నిట్లో కూడా మైదాని అధికంగా వాడుతూ ఉంటారు. మైదాని తీసుకోవడం వల్ల ఇది మన శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. ఆల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్ గా మైదాని అంటారు. ఇది మనం తీసుకున్న వెంటనే గ్లూకోస్ గా మారుతుంది. దీనివల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. మైదా పిండిలో ఫైబర్ అసలే ఉండదు. దీనివల్ల మనం తీసుకున్న ఈ మైదా వల్ల ఉబకాయం మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మైదాను అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ ను  పెంచుతుంది- మైదానం అధికంగా తీసుకోవడం వల్ల ఇది మన శరీరంలో గ్లూకోస్ స్థాయిలను పెంచుతుంది. దీని ద్వారా షుగర్ అనేది పెరుగుతుంది. ఇది ఆల్ట్రా ప్రాసెస్ చేసిన పద్ధతిలో ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎటువంటి పోషకాలు కూడా ఉండవు. మైదాను అధికంగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. దీని ద్వారా రక్తంలో చక్కెర పెరుగుతుంది. దీని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అమాంతం పెరుగుతాయి. కాబట్టి మైదాను మధుమేహం ఉన్నవారు వాడకుండా ఉంటేనే మంచిది.

మలబద్దకాన్ని పెంచుతుంది- మైదాలో ఫైబర్ లేకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు పెరుగుతాయి. దీన్ని అధికంగా తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. దీని బదులుగా గోధుమలను తీసుకోవడం ఉత్తమం. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది.

Health Tips: గర్భధారణ సమయంలో శృంగారం చేయడం ఎంతవరకు సురక్షితం ...

బరువు పెరుగుతారు- మైదాలో క్యాలరీలు కార్బోహైడ్రేట్లో అధికంగా ఉంటాయి. ఇందులో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల మీకు బరువు పెరుగుతారు. మీ శరీరంలోకి అనవసరమైన క్యాలరీలు వెళతాయి. బరువు తగ్గాలి అనుకునే వారు మైదానం వాడకపోవడమే ఉత్తమం.

రోగనిరోధక శక్తి తగ్గుతుంది- మైదా పిండిలో ఎటువంటి పోషకాలు విటమిన్లు ఉండవు. దీనివల్ల మన శరీరానికి కావాల్సినంత ఇమ్యూనిటీ లభించదు. దీన్ని వాడడం తగ్గించడం వల్ల మనం తీసుకున్న ఆహారాలలో ఉన్న పోషకాహారాలన్నీ కూడా మన శరీరానికి అందుతాయి.

మైదాకు బదులుగా గోధుమలు బాదం కొబ్బరి బ్రౌన్ రైస్ జొన్న మిల్లెట్స్ రాగి వంటివి తీసుకోవడం ఉత్తమం వీటివల్ల పోషకాలు లభిస్తాయి విటమిన్లు కూడా లభిస్తాయి వీటిని తీసుకోవడం ద్వారా మీ శరీరానికి శక్తి కూడా లభిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif