IPL Auction 2025 Live

Health Tips: అరికాళ్ల మంట సమస్య మిమ్మల్ని బాధిస్తుందా? ఈ 5 ఇంటి చిట్కాలు పాటించండి...

అరికాళ్ల మంటకి ఇంటి చిట్కాలు ఉన్నాయి, వీటిని ఉపయోగించి మీరు అరికాళ్ల మంట నుండి ఉపశమనం పొందవచ్చు.

file

తరచుగా కొందరు వ్యక్తులు అరికాళ్ల మంట సమస్యను ఎదుర్కోంటు ఉంటారు. అరికాళ్ల మంట కండరాలలో ఒత్తిడి, ఏదైనా వాపు లేదా ఆర్థరైటిస్ సమస్య వల్ల వస్తుందని వైద్యులు తేలిపారు.ఈ మంటను సకాలంలో తొలగించడం చాలా ముఖ్యం. లేకపోతే, ఈకారణంగా రోజువారీ పని కూడా దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ సమస్యను అధిగమించడానికి, అరికాళ్ల మంటకి ఇంటి చిట్కాలు ఉన్నాయి, వీటిని ఉపయోగించి మీరు అరికాళ్ల మంట నుండి ఉపశమనం పొందవచ్చు.

పసుపు ,పాలు: ఒక గ్లాసు వేడి పాలలో చిన్న చెంచా పసుపు కలుపుకుని తాగాలి. పసుపులోని లక్షణాలు అరికాళ్ల మంట తగ్గించడంలో సహాయపడతాయి.మీకు చాలా ఉపశమనం లభిస్తుంది.

ఉప్పు నీరు: గోరువెచ్చని నీటిలో ఉప్పు కలపండి మరియు ఆ నీటిలో మీ అరికాళ్లనుబెట్టండి. ఇది నొప్పిని తగ్గిస్తుంది. వాపును కూడా తగ్గిస్తుంది.

ఐస్ ప్యాక్: మీ అరికాళ్ల మంట నుండి ఉపశమనం పొందడంతో పాటు, ఐస్ ప్యాక్ వల్ల నుండి ఉపశమనం లభిస్తుంది, అయితే నేరుగా ఐస్ ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. దానిని ఒక గుడ్డలో చుట్టి ఐస్ వేయండి.

మసాజ్: అరికాళ్లను సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మంట తగ్గుతుంది. కావాలంటే ఆవాల నూనెను వేడి చేసి, దానితో మసాజ్ చేయండి.

వెల్లుల్లి ఉపయోగాలు: వెల్లుల్లిని కొబ్బరి నూనెలో వేసి ఆ నూనెను ప్రభావిత ప్రాంతంలో రాయండి. ఇలా చేయడం వల్ల అరికాళ్ల మంట నుంచి ఉపశమనం పొందవచ్చు.