Health Tips: కలబంద రసంలో పసుపు కలిపి తాగినట్లయితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

మారుతున్న వాతావరణ కాలుష్యము ,వాతావరణంలో మార్పుల కారణంగా తరచుగా చాలా మందిలో జలుబు దగ్గు ఇతని ఇన్ఫెక్షన్ల సమస్య ఎక్కువగా ఉంది

aloe vera

మారుతున్న వాతావరణ కాలుష్యము ,వాతావరణంలో మార్పుల కారణంగా తరచుగా చాలా మందిలో జలుబు దగ్గు ఇతని ఇన్ఫెక్షన్ల సమస్య ఎక్కువగా ఉంది. అటువంటివారు తమ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకున్నట్లైతే రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. దీని ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. అయితే పసుపు కలబంద కలిపిన రసాన్ని మీరు తీసుకోవడం ద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడతారు. పసుపు కలబంద జ్యూస్ కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇమ్యూనిటీ- కలబందలో ,పసుపులో రెండిట్లో కూడా యాంటీ బ్యాక్టీరియాల్ ,యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపులో ముఖ్యంగా కర్చు అనేది ఉంటుంది. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో సహాయపడుతుంది. రెగ్యులర్గా మీరు వీటిని తీసుకోవడం ద్వారా మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని కారణంగా జ్వరం జలుబు దగ్గు వంటి అంటూ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

Health Tips: పీరియడ్స్ సమయంలో తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారా ...

చర్మానికి చాలా మంచిది- అలోవెరా జెల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతేకాకుండా మచ్చలు మొటిమలు రాకుండా చేస్తుంది. పసుపులో కూడా యాంటీ ఇన్ఫర్మేషన్ గుణాలు ఉండటం వల్ల మన చర్మం లో పేరుకుపోయిన అనేక రకాల మలినాలను బయటికి తగ్గించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా మన చర్మం మెరుగుపడుతుంది మెరుస్తుంది.

ఎసిడిటీ- కడుపు బరం గ్యాస్ ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు తగ్గించడంలో పసుపు చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా కలబంద రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కలబందను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎసిడిటీ గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోయి జీర్ణ వ్యవస్థ బలపడుతుంది.

బరువు తగ్గుతారు- కలబంద పసుపు జ్యూస్ తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. పసుపు మన జీర్ణ క్రియను పెంచుతుంది. పసుపు కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రెండిటి కలయిక వల్ల బరువు ఈజీగా తగ్గుతారు..

ఎలా తాగాలి- ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ పసుపు, రెండు నుంచి మూడు స్పూన్ల కలబంద జ్యూస్ కలిపి తీసుకోవాలి. ఈ రెండిటిని తీసుకోవడం వల్ల మీకు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ,యాంటీ ఫంగల్ వల్ల రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. అంటే కాకుండా ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే మీకు తక్షణ శక్తి కూడా లభిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



సంబంధిత వార్తలు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.