Health Tips: బ్లాక్ టీ మంచిదా బ్లాక్ కాఫీ మంచిదా తెలుసుకుందాం..
ప్రతిరోజు టీ తీసుకోవడం ఒక అలవాటుగా మారింది. కొంతమంది కాఫీని ఇదే రీతిలో వాడుతూ ఉంటారు.
భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా టీ అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతిరోజు టీ తీసుకోవడం ఒక అలవాటుగా మారింది. కొంతమంది కాఫీని ఇదే రీతిలో వాడుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో పాలతో కలిపిన టీ లేదా కాఫీ ది చాలా మంది తీసుకోవడం లేదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బ్లాక్ కాఫీలు లేదా బ్లాక్ డేని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రెండింటిలో బ్లాక్ కాఫీ మంచిదా లేదా బ్లాక్ టీ మంచిదా అనే సందేహం కొంతమందిలో ఉంది. అటువంటి దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
బ్లాక్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు.
బ్లాక్ కాఫీలో కొల్లజనీక్ యాసిడ్ ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ క్రియలు పంచడంలో సహాయపడుతుంది.
బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఇనిస్టెంట్ శక్తి లభిస్తుంది. ఇది జీవ క్రియకు చాలా మంచిది. బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల ఇందులో పాలు, చక్కెర ఉండవు. కనుక ఇది జీరో క్యాలరీగా చెప్పవచ్చు. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. బ్లాక్ కాఫీలు తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
Health Tips: చలికాలంలో విటమిన్ డి లోపం సమస్య ఏర్పడుతుంది.
బ్లాక్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు.
బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫాలిఫైనల్స్ ఫ్లేవర్ యాడ్స్ ఉంటాయి.
ఇది మెదడుకు ఆక్సిజన్ అందించడంలో సహాయపడుతుంది.
బ్లాక్ టీ లో థియో బ్రోమిన్ ఉంటాయి. ఇవి మెదడును చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు బ్లాక్ టీ సహకరిస్తుంది. బ్లాక్ టీ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇది సీజనల్ వచ్చే జబ్బుల్లో తగ్గిస్తుంది. ఇది తీసుకోవడం ద్వారా చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వాటిని దూరం చేస్తుంది.
ఏది మంచిది.
బ్లాక్ టీ బ్లాక్ కాఫీ రెండు కూడా మంచి పోషకాలను కలిగి ఉంటాయి. ఈ రెండిటిని తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అయితే బ్లాక్ కాఫీ గుండె జబ్బులు ఉన్నవారు తక్కువగా తీసుకోవడం మంచిది. దీనివల్ల గుండె స్పందన రేటు పెరుగుతుంది. అందుకని గుండె జబ్బులు ఉన్నవారు కాఫీ బ్లాక్ కాఫీ కి దూరంగా ఉంటే మంచిది. బ్లాక్ టీ అధికంగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కడుపుబ్బరం, గ్యాస్ ప్రాబ్లం, వంటి వారు బ్లాక్ టీ కి దూరంగా ఉండాలి. అయితే ఈ రెండిట్లో కూడా ఒకే రకమైన పోషకాలు ఉండడం ద్వారా రెండు కూడా మంచిదే అని చెప్పవచ్చు. అయితే ఏదైనా సరే మితంగా తీసుకోవడం ఉత్తమం. రోజుకి ఒకటి నుంచి రెండు కప్పులు మాత్రం బ్లాక్ కాఫీ అయినా బ్లాక్ అయినా తీసుకోవడం ఉత్తమం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి