Health Tips: చలికాలంలో కాళ్లు చేతులు ఎందుకు తిమ్మిరిగా మారుతాయి, కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఇది చాలా కాలం మీ శరీరంలో కనిపించినట్లయితే మీ శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.
చలికాలం వచ్చిందంటే చాలు చాలామందిలో కాళ్లు చేతులు ఎప్పుడూ తిమ్మిర్లుగా లాగినట్టుగా చల్లగా అనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఇది చాలా కాలం మీ శరీరంలో కనిపించినట్లయితే మీ శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కారణాలు- చలికాలం వచ్చినప్పుడు మన శరీరంలో రక్తప్రసరణలో చాలా మార్పు వస్తుంది. శరీరము వెచ్చగా ఉండడం కోసం రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. దీని ద్వారా కాళ్లు చేతులు తిమ్మిర్లుగా మారడం లాగడము వంటి సమస్యలు ఏర్పడతాయి.
రక్త ప్రసరణలో సమస్యలు- ఎక్కువసేపు ఒకచోటే కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ శరీర భాగాలకు అందదు. ఇది తగ్గినప్పుడు ఆక్సిజన్ పోషకాలు అవయవాలకు చేరవు. చల్లటి వాతావరణంలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీని వల్ల చేతులు కాళ్లు రక్త ప్రసరణ తగ్గడం ద్వారా తిమ్మిర్లు లాగడం వంటి ఏర్పడతాయి. రక్తప్రసరణ దగ్గర ఒక్కొక్కసారి గుండె సంబంధం సమస్యలు కూడా ఏర్పడతాయి.
Health Tips: రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే మీ శరీరంలో ఏమవుతుంది
రక్తహీనత- రక్తహీనత సమస్య ఉన్నవారిలో శరీరంలో ఎర్ర రక్త కణాల లోపం అధికంగా ఉంటుంది. ఇది అవయవాలకు ఆక్సిజన్ ను సరిగ్గా సరఫరా చేయదు. దీనివల్ల శరీరం తిమ్మిరిగా మారడం. ముఖ్యంగా బి12 లోపము ఐరన్ లోపం పోలేట్ లోపం వల్ల కూడా రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా గర్భిణీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. సరైన ఆహారము తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య మరింతగా పెరుగుతుంది.
షుగర్- షుగర్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. దీని వలన రక్త ప్రసరణ లో మార్పులు వస్తాయి. దీని వలన నరాల బలహీనపడి పాదాల్లో చల్లదనం ఏర్పడుతుంది. అంతేకాకుండా తిమ్మిరి, జలధింపులు వంటివి కూడా ఎక్కువగా షుగర్ పేషెంట్స్ లో కనిపిస్తాయి. దీన్నే డయాబెటిక్ న్యూరోపతి అని అంటారు.
నరాల సమస్య- నరాల సమస్యలు ఉన్నవారికి కూడా రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల నరాల పైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది నల్ల నరాలను బలహీన పరిశీల చేస్తుంది. దానికి కారణంగా కాళ్లు చేతులు తిమ్మిర్లుగా మారడము ఏర్పడుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి