Health Tips: కుంకుమపువ్వు నీటిని తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం..

అయితే టీ కాకుండా అనేకరకాలైనటువంటి డ్రింక్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ప్రతిరోజు ఉదయాన్నే కుంకుమ పువ్వు నీటిని తాగడం ద్వారా అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి

saffron tea

చాలామంది ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే టీ కాకుండా అనేకరకాలైనటువంటి డ్రింక్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ప్రతిరోజు ఉదయాన్నే కుంకుమ పువ్వు నీటిని తాగడం ద్వారా అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. గ్యాస్ సమస్యలు రాకుండా చేస్తుంది. మన శరీరానికి కావాల్సిన విటమిన్లను అందిస్తుంది. ద్వారా ఇది మీకు ఒక మంచి పోషకమైన నీటిగా చెప్పవచ్చు దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్లు- కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ నుంచి పోరాడుతాయి బయట పడేస్తాయి. ఆంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి కూడా లేకుండా ఉంటుంది. ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మంచి నిద్ర- ప్రతిరోజు కుంకుమ పువ్వు నీటిని తీసుకోవడం ద్వారా నిద్ర కూడా మంచిది. దీన్ని ప్రతి రోజు తీసుకోవడం ద్వారా గాఢ నిద్ర వస్తుంది.

జీర్ణ క్రియ- కుంకుమ పువ్వు నేను నీటిని తీసుకోవడం ద్వారా కడుపులో గ్యాస్, అజీర్ణం తగ్గిపోతాయి. మన జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Health Tips: కడుపులో అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..

మహిళలకు మంచిది- మహిళల్లో పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపునొప్పి, తల తిరగడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అటువంటివారు కుంకుమపువ్వు నీటిని తీసుకోవడం ద్వారా ఇది మృత సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్ నుండి  బయటపడేస్తుంది.

ఎలా తయారు చేసుకోవాలి- ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని మరిగించాలి. అందులో ఒక ఐదు ఆరు రేకుల కుంకుమ పువ్వులు వేసి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత దీన్ని వడకట్టుకొని అందులో నిమ్మరసాన్ని కానీ తేనె కలుపుకొని తాగవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



సంబంధిత వార్తలు

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ