Health Tips: చలికాలంలో పసుపు తేనె కలిపి తీసుకోవడం ద్వారా అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ముఖ్యంగా పెద్దవారిలో చిన్న పిల్లలు ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది.

Reprasentative Image (Image: File Pic)

చలికాలం వచ్చిందంటే చాలు జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా పెద్దవారిలో చిన్న పిల్లలు ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పసుపు తేనెలు ఉండిటిని కలిపి తీసుకోవడం ద్వారా ఆయుర్వేదంలో దీర్ఘకాలికంగా వచ్చే ఉండే అనేక ఆరోగ్య సమస్యలతో పాటు తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఉష్ణోగ్రతల్లో మార్పు వల్ల తరచుగా జ్వరం వంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. తేనే, పసుపు రెండిటిని కలిపి తీసుకోవడం ద్వారా గొంతు నొప్పి, జలుబు, జ్వరం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. తేనె ,పసుపు కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

దగ్గు, జలుబు- జలుబు దగ్గు సమస్యతో బాధపడే వారికి పసుపు, తేనె ఒక చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ రెండిటిని కలిపి తీసుకోవడం ద్వారా మన శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా దగ్గు జలుబు వంటి లక్షణాలు తగ్గుతాయి. పసుపు, తేనె కలిపి తీసుకోవడం ద్వారా వీటన్నిటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

Health Tips: టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా,

గుండెకు మంచిది- గుండె సమస్యలు ఉన్నవారికి తేనె పసుపు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.ఇది రక్తనాళాలను శుభ్రపరుస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహంతో బాధపడే వారికి ఈ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారు తేనే పసుపు కలిపి తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

జీర్ణ క్రియ- పసుపు, తేనె కలిపి తీసుకోవడం ద్వారా  కడుపులో జీర్ణర ఎంజైములను ఉత్పత్తి చేయడంలో ఈ సహాయపడుతుంది దీని ద్వారా జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.

 రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది- తేనే పసుపు రెండిటినీ తీసుకోవడం ద్వారా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ను వైరస్లను చంపడానికి సహాయపడతాయి. అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ప్రతిరోజు తేనే పసుపు కలిపి తీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ పెరిగి అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

రక్త శుద్ధికి- మన శరీరాన్ని డిటెక్స్పై చేయడానికి పసుపు తేనే రెండు సహాయపడతాయి. ఈ రెండిటి తీసుకోవడం ద్వారా రక్తంలో ఉన్న మలినాలను తొలగించుకోవచ్చు. రక్త శుద్ధికి ఇది సహాయపడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి