Health Tips: ఈ చెడు అలవాట్లు మీకు కిడ్నీకి హాని కలిగిస్తాయి..అవేంటో తెలుసుకుందాం..
మన శరీరం నుండి వ్యర్ధాలను, ఆమ్లాలను బయటకు పంపించడంలో కిడ్నీలు సహాయపడతాయి. రక్తంలో నీరు, లవణాలు ,ఖనిజాల సమతుల్యతను నిర్వహించడంలో కిడ్నీలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి.
మన శరీరాన్ని కాపాడడానికి కిడ్నీలు సహాయపడతాయి. మన శరీరం నుండి వ్యర్ధాలను, ఆమ్లాలను బయటకు పంపించడంలో కిడ్నీలు సహాయపడతాయి. రక్తంలో నీరు, లవణాలు ,ఖనిజాల సమతుల్యతను నిర్వహించడంలో కిడ్నీలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అయితే కొన్ని రకాలైనటువంటి హానికర అలవాట్ల వల్ల కిడ్నీలకు ఇబ్బంది కలిగితుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పెయిన్ కిల్లర్స్- ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం ,బాడీ బిల్డింగ్ కోసం సప్లిమెంట్లు తీసుకోవడం ఇవి మూత్రపిండాలను పనితీరును ఇబ్బందికి గురిచేస్తాయి. దీర్ఘకాలికంగా వీటిని వాడడం ద్వారా కిడ్నీలో పాడవుతాయి. కాబట్టి వీటిని డాక్టర్ సలహాదా మేరకు మాత్రమే వాడడం మంచిది.
అధిక ఉప్పు- ఉప్పును అధికంగా వాడుతుంటారు. కేవలం రుచి కోసమే కాకుండా కొంతమంది ఎక్కువగా ఉప్పును తీసుకుంటారు. ఇది మూత్రపిండాలను ప్రమాదంలో పడేస్తుంది. అధిక సోడియం వల్ల బిపి కూడా పెరుగుతుంది. దీనివల్ల కిడ్నీల పనితీరు మందగిస్తుంది. కాబట్టి ఉప్పును సాధ్యమైనంత తక్కువగా వాడడం మంచిది.
ప్రాసెస్ ఆహారాలు- ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలలో షుగర్ లెవెల్స్ ,సోడియం అధికంగా ఉంటుంది. దీని ద్వారా కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటిని సాధ్యమైనంత వరకు తక్కువ తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు హాని జరగదు.
Health Tips: కుంకుమపువ్వు నీటిని తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఏమిటో ...
నిద్రలేమి- తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. మూత్రపిండాలు కూడా దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిద్ర లేకపోవడం వల్ల అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. కనుక మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం తగినంత నిద్ర అవసరం.
హైడ్రేట్- మన మూత్రపిండాల పనితీరు సక్రమంగా జరగాలంటే మనం ఎల్లప్పుడూ కూడా హైడ్రేటెడ్ గా ఉండాలి. మీరు తక్కువగా ఉన్నప్పుడు మనకి ఇడ్లీల పైన ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. దీని ద్వారా రక్తప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. బయటకి పంపించే వ్యర్ధాల విషయంలో కాస్త ఒత్తిడి కలుగుతుంది. కాబట్టి ఎక్కువగా నీటిని తీసుకోవడం ద్వారా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ధూమపానం, మద్యపానం- ధూమపానం మద్యపానం చేసేవారిలో ముద్రపిండాలకు చాలా హానికరాన్ని కలిగిస్తుంది. ధ్రువపనం చేసేవారిలో మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా పోతుంది. ఇది కిడ్నీలను దెబ్బతీయడానికి సంకేతంగా చెప్పవచ్చు. ధూమపానం ,మద్యపానం వల్ల మూత్రపిండాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, కాబట్టి వీటిని వెంటనే మానివేయడం ఉత్తమం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి