Health Tips: ఈ ఆహార పదార్థాలను ఎప్పుడూ కూడా పచ్చిగా తినకూడదు. తింటే చాలా ప్రమాదకరం..

అయితే అవన్నీ కూడా మనం పాటిస్తాం ఒక్కొక్కసారి కొన్ని ఆహార పదార్థాలను పచ్చిగా తినడం మంచిది కాదు.

Egg Challenge, Uttar Pradesh. Image used for representational purpose. | Photo: Pixabay

ఆరోగ్యంగా ఉండాలంటే మనకు మంచి తాజా పండ్లు కూరగాయలు తినాలని చెప్తూ ఉంటారు. అయితే అవన్నీ కూడా మనం పాటిస్తాం ఒక్కొక్కసారి కొన్ని ఆహార పదార్థాలను పచ్చిగా తినడం మంచిది కాదు. వీటిని తినడం వల్ల శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడి వ్యాధులకు కారణమవుతాయి. అయితే ఈ ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పచ్చగా తినకూడదు. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ- ఎప్పుడు కూడా పచ్చిగా తినకూడదు. దీనివల్ల శరీరానికి చాలా హాని కలుగుతుంది. పచ్చి వంకాయ తినడం వల్ల కడుపులో నొప్పి, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా దీంట్లో టాక్స్ ఉంటాయి.

బంగాళాదుంప- బంగాళదుంపలు కూడా సోలని విషపూరిత మూలకం ఉంటుంది. దీన్ని పచ్చిగా తినడం వల్ల మన శరీరానికి చాలా హాని చేస్తుంది. ఇది కడుపునొప్పి వాంతులు వంటి ప్రభావాలను చూపిస్తుంది. ముఖ్యంగా మొలకెత్తిన బంగాళాదుంపనులు తినడం మానుకోవాలి. వాటిలో సులని అనేది అధికంగా ఉంటుంది.

Health Tips: మహిళల్లో అవాంఛిత రోమాలు రావడానికి కారణాలేంటి తెలుసుకుందాం.

బెండకాయ- బెండకాయను కూడా పచ్చిగా తినకూడదు. దీనివల్ల కడుపులో నొప్పి కడుపుబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇందులో ఉండే లెక్కింపు జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా దీన్ని తీసుకోవడం ద్వారా ఎలర్జీ వంటి సమస్యలు కూడా కలుగుతాయి..

బీన్స్- బీన్స్ ను కూడా ఎట్టి పరిస్థితుల్లో పచ్చిగా తినకూడదు. ఇందులో ఫైటో హిమాగ్లు టీన్ వంటి మూలకం ఉంటుంది. దీన్ని పచ్చిగా తీసుకోవడం ద్వారా కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు కలుగుతాయి. అంతేకాకుండా ఇది జీర్ణం వ్యవస్థ పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.

కోడిగుడ్లు- పచ్చి కోడిగుడ్లలో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇది అనేక హానిని కలిగిస్తుంది. ముఖ్యంగా సాల్మొనేళ్ల బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజన్ గా కూడా మారుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడిగుడ్డును పచ్చిగా తినకూడదు. దీనివల్ల జ్వరం, విరోచనాలు,వాంతులు వంటి సమస్యలు ఏర్పడతాయి. ఎప్పుడైనా సరే కోడిగుడ్డును బాగా ఉడకపెట్టిన తర్వాతే తినాలి. దీని ద్వారా బ్యాక్టీరియా పూర్తిగా నాశనం అవుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి