Health Tips: కడుపులో వచ్చే క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏమిటి? దీనికి రావడానికి గల కారణాలు తెలుసుకుందాం..

మనం తీసుకున్న ఆహార పదార్థాలలో కొన్ని తప్పులు చేయడం వల్ల ఇది ఈ సమస్య ఏర్పడుతుంది.

Cancer (Photo-PTI)

ఈమధ్య కాలంలో చాలామందిలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు. మనం తీసుకున్న ఆహార పదార్థాలలో కొన్ని తప్పులు చేయడం వల్ల ఇది ఈ సమస్య ఏర్పడుతుంది. అయితే కొన్నిసార్లు ఉప్పు తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి అనేక రక హాని జరుగుతుంది. ఉప్పు వినియోగం ఎక్కువైనపుడు మన శరీరం పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఉప్పు అతిగా తీసుకోవడం వల్ల రక్తపోటు క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈరోజు గ్యాస్టిక్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం.

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే ఏమిటి

ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ రకం పెరుగుతూ ఉంది. కడుపులో వచ్చే క్యాన్సర్లు కనితులు ఏర్పడతాయి. ఇది తీవ్రమైన సంకేతాలను ఇస్తుంది. దీనినే గ్యాస్టిక్ క్యాన్సర్ లేదా కడుపులో వచ్చే క్యాన్సర్ అని చెప్పవచ్చు.

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు..

అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం కడుపులో నొప్పి, కళ్ళు తిరగడం, ఆకలి లేకపోవడం, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, తరచుగా విరోచనాలు లేదా, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడడం అలసట, నీరసం, బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపిస్తే కొంచెం ఆహారం తిన్న కూడా కడుపు నిండిన అనుభూతి ఒక్కోసారి వాంతులు అజీర్ణం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు.

ఉప్పు తగ్గించడం.. కొన్ని పరిశోధనల వల్ల ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కడుపులోని ప్రేగులపైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది వాపుకి మంటను పెంచుతుంది. హెలికాఫ్ బాక్టర్ పైలోరి అనే బాక్టీరియా ఈ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది కడుపులో అల్సస్ రావడానికి కారణం అవుతుంది. ఈ హెలిక బాక్టర్ పైలోరియా అనే బ్యాక్టీరియా కడుపులో వచ్చే క్యాన్సర్కు ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. దీని కారణంగా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి ఉప్పుని తగ్గించుకోవడం ఉత్తమం.

అంతే విధంగా ధూమపానం మద్యపానం వంటివి కూడా కడుపులో వచ్చే క్యాన్సర్ కారణాలుగా చెప్పవచ్చు. కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండడం. మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలాగా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. బరువు ఎప్పుడు కూడా నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రతిరోజు వాకింగ్ చేయడం యోగ ,ప్రాణాయామం వంటివి చేయడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif