Health Tips: చలికాలంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే ఏ ఆహార పదార్థాలు తినాలి ఏవి తినకూడదు..

అంతేకాకుండా వేడివేడిగా ,స్వీట్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.

source: pixabay

చలికాలంలో చాలామంది రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా వేడివేడిగా ,స్వీట్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే చలికాలంలో కొన్ని ఆహార ప్రాంతాలు మనకు అంత మంచిది కాదు. కొన్ని ఆహార పదార్థాలు ప్రమాదకరంగా మారుతాయి. అటువంటి సమయంలో చలికాలంలో మనం ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఏ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

చల్లటి ఆహారాలు- చలికాలంలో ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ,ఫ్రిజ్లో పెట్టిన చల్లనీరు, తాగకూడదు. ఇవే మన శరీర ఉష్ణోగ్రతను మరింతగా తగ్గిస్తాయి.రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. అంతేకాకుండా జలుబు, దగ్గు ,గొంతు నొప్పి ,జ్వరము వంటి సమస్యలను పెంచుతుంది. చల్లటి పదార్థాలు అధికంగా తీసుకోవడం ద్వారా మన శరీరం చల్లబడుతుంది. ఇది కీళ్ల నొప్పులకు మరియు ఇతర ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కండరాలను ప్రభావితాన్ని చేస్తుంది.

డీప్ ఫ్రై ఆహారాలు- చలికాలంలో చాలామంది వేడివేడిగా పకోడీలు, కచోరి, సమోసా వంటి డీప్ ఫ్రై ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు.వీటిని ఎక్కువగా తినడం ద్వారా జర్ఱ వ్యవస్థ పైన ఒత్తిడి పెరుగుతుంది.  గ్యాస్ ,ఎసిడిటీ సమస్యలు ఏర్పడతాయి. ఆయిల్ ఫుడ్ లో అధిక మొత్తంలో ట్రాన్స్ఫాట్ అధికంగా ఉంటుంది. ఇది గుండెకు హానిని కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్ ను పెంచుతుంది.

Health Tips: ప్రతిరోజు బీట్రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ...

 కేఫిన్- చలికాలంలో వేడిగా ఉండేందుకు చాలామంది కాఫీ టీలను ఎక్కువగా తీసుకుంటారు. దీని అధికంగా తీసుకోవడం వల్ల శరీరం డిహైడ్రేట్ అవుతుంది. ఇది చర్మం పొడి వారడం పెదవులు పలిగిపోవడం జుట్టు రాలడం చర్మ సమస్యలకు దారితీస్తుంది అలసటకు పెరుగుతుంది.

ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి- పండ్లు కూరగాయలను విటమిన్లు మినరల్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా చలికాలంలో మీకు  శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఉసిరి, క్యారెట్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన శరీరానికి శక్తిని అందించడమే కాకుండా చర్మానికి కూడా మంచిది.

వ్యాయామం- చలికాలంలో శరీరాన్ని చురుగ్గా ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ముఖ్యం భాగంగా మార్నింగ్ చేయడం ఇష్టపడరు. కాబట్టి దానివల్ల మీకు ఇబ్బంది వచ్చే సమస్యలు ఉంటాయి .మానసిక పరిస్థితి కూడా అంతగా బాగుండదు. తర్వాత స్నానం చేయడం ద్వారా మీకు మానసిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి