Health Tips: కీటో డైట్ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఎలా చేయాలో తెలుసుకుందాం.
దాని ప్రయోజనాలు దాని వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. చాలామంది ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి ,శరీరంని చురుగ్గా ఉంచేందుకు కీటో డైట్ ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు.
ఈరోజుల్లో చాలామంది బరువు తగ్గడం కోసం కీటో డైట్ ను ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాని ప్రయోజనాలు దాని వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. చాలామంది ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి ,శరీరంని చురుగ్గా ఉంచేందుకు కీటో డైట్ ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా కార్బోహైడ్రేట్లను పూర్తిగా తగ్గించాలి. కేవలం ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని మాత్రమే ఇందులో చేర్చుకోవాలి. తక్కువ కార్బోహైడ్రేట్ డైట్ అని కూడా అంటారు ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్స్ ను ఎక్కువ ప్రోటీన్ ని తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావాల్సినంత శక్తి అందుతుంది. అని నిపుణుల అభిప్రాయం ముఖ్యంగా మాంసము, చేపలు, తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న కూరగాయలు ఉంటాయి. అంతే కాకుండా ఇందులో సి ఫుడ్స్, చికెను, మాంసం, చేపలు, గుడ్డు, క్యాలీఫ్లవర్, టమాటా వంటివి ఉంటాయి.
కీటో డైట్ లో కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకుంటారు. ముఖ్యంగా అవకాడో, కొబ్బరినూనె, నెయ్యి, వెన్న, అదేవిధంగా బాదం, వాల్నట్, చియా సీడ్స్ వంటి వాటిని కూడా వాడుతూ ఉంటారు. అంతే కాకుండా సాల్మన్ ఫిష్ వంటి కొవ్వు చేపలను తీసుకుంటారు. చికెన్ ,మటన్, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులు కూడా ఈ కీటో డైట్ లో చేరుస్తారు.తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆకుకూరలను కూడా తీసుకుంటారు. బచ్చలి కూర, బ్రకోలి, క్యాబేజీ, గుమ్మడికాయ, క్యాప్సికం వంటి వాటిని ఇందులో చేర్చుతారు
ఎక్కువగా ఉండే కార్బహహైడ్రేట్ ఎక్కువ ఉన్న పదార్థాలను వదిలివేస్తారు. ముఖ్యంగా స్వీట్స్, బేకరీ ఉత్పత్తులు, పాస్తా ,బ్రెడ్ అన్నం వంటి వాటిని పూర్తిగా మాని వేస్తారు.
Health Tips: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా
కీటో డైట్ ప్రయోజనాలు
బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఆకలి స్థాయిలను తగ్గిస్తుంది. జీర్ణక్రియ ప్రోత్సహించడం ద్వారా మన మెటబాలిజం పెరుగుతుంది. అంతేకాకుండా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. కీటో డైట్ వల్ల మెదడుకు మెరుగైన శక్తి లభిస్తుంది. మానసికమైన ఆందోళన డిప్రెషన్ వంటివి తగ్గిపోతాయి.
సైడ్ ఎఫెక్ట్స్: కీటో డైట్ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇది పడని వారికి కొంతమందిలో తలనొప్పి, అలసట, చిరాకు వంటివి ఏర్పడతాయి. అంతేకాకుండా దీర్ఘకాలికం పాటు ఈ కీటో డైట్ ను అనుసరించడం వల్ల పోషకాలలో లోపము ఏర్పడుతుంది. దీని ద్వారా గుండె సంబంధం సమస్యలు ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కీటో డైట్ ను ప్రారంభించడానికి ముందు కచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. మీరు గనక ఏ ఇతర ఆరోగ్య సమస్యల నుంచి బాధపడుతున్నట్లయితే కంపల్సరిగా డాక్టర్ని సంప్రదించాలి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.