Heart Disease: పురుషుల్లో గుండె జబ్బులు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయో తెలుసా? గుండె జబ్బులు రాకుండా ఇవి చేస్తే చాలు, మీ గుండె పదిలం

హఠాత్తుగా అనారోగ్యం పెరిగి ప్రాణాలు కోల్పోయే వారిలో గుండె జబ్బులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా జరిపిన ఓ సర్వేలో (Survey) స్త్రీల కంటే పురుషుల్లోనే ఈ సమస్య కనిపిస్తున్నట్లు తేలింది. గుండె జబ్బులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.

Hyderabad, June 10: గుండె జబ్బులు (heart disease) మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమే కాదు, ఆయుష్షును కూడా తగ్గించేస్తాయి. హఠాత్తుగా అనారోగ్యం పెరిగి ప్రాణాలు కోల్పోయే వారిలో గుండె జబ్బులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా జరిపిన ఓ సర్వేలో (Survey) స్త్రీల కంటే పురుషుల్లోనే ఈ సమస్య కనిపిస్తున్నట్లు తేలింది. గుండె జబ్బులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న లైఫ్‌ స్టైల్ తో పాటూ, చాలా రకాల పరిస్థితులు కారణం అవుతున్నాయి.  వీటికి కారణాలేమై ఉండొచ్చంటే..

1. మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అంటే వ్యాయామం(Exersice) లాంటివి చేయకపోతే గుండెపోటు ప్రమాదం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

2. ఒత్తిడి (Stress), డిప్రెషన్ కారణంగా కొంతమంది అతిగా తినేస్తుంటారు. దీని కారణంగా ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ మొదలైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Heart Attack Risk: 30-35 వయస్సు వారికే గుండెపోటు అవకాశాలు ఎక్కువ, ఎందుకో తెలుసా? సంచలనం సృష్టిస్తున్న డాక్టర్ల అధ్యయనాలు, గతంతో పోలిస్తే పెరిగిన గుండెపోటు రిస్క్ శాతం     

3. ఆందోళన ఎక్కువగా ఉంటే ఉదయాన్నే నిద్రలేచి యోగా, ధ్యానం వంటివి చేయండి.

Saw Someone Dying In Dream: నిద్రలో చావు కలలు వస్తుంటే మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా  

4. మగవారైతే చాలా ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు దగ్గరగా ఉన్న వారితో మాట్లాడండి. ఇలా చేయడం వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది.

5. బయట దొరికే ఆహారాన్ని తక్కువగా తినండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి, అలసటను దూరం చేసుకోగలం.

6. మనస్సును రిలాక్స్ చేయడానికి, సమతుల్య భోజనం తినడానికి నచ్చిన పనులను చేయండి. అలా చేస్తే లోపల నుంచి సంతోషంగా ఉండగల్గుతారు.

7. మనసులో రకరకాల అంతర్మథనాన్ని పక్కకుపెట్టి ఎక్కువగా కుటుంబంతో గడిపేందుకు ప్రయత్నించండి